టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి పదవి.. మేము వేసిన భిక్ష
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:24 PM
‘టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పదవి అవతలి వ్యక్తికి దువ్వాడ వేసిన భిక్ష. అతను ముష్టి వేస్తే.. ఎవరో అవతలి వ్యక్తికి ఇన్‌చార్జి పదవి వచ్చింది. అంతేకానీ దువ్వాడ శ్రీనివాస్‌ను తలదన్నుకుని వైసీపీలో ఇన్‌చార్జిగా, ఎమ్మెల్యేగా తీసుకునే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే టెక్కలి అంటే దువ్వాడ శ్రీను.. దువ్వాడ శ్రీను అంటే టెక్కలి. ఇది అందరికీ తెలుసు’ అని దివ్వల మాధురి వివాదస్పద వాఖ్యలు చేశారు.
- దువ్వాడ శ్రీను రాష్ట్రానికి రాజు, కింగ్ మేకర్
- దివ్వల మాధురి వివాదస్పద వాఖ్యలు
టెక్కలి, సెప్టెంబరు 11: ‘టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పదవి అవతలి వ్యక్తికి దువ్వాడ వేసిన భిక్ష. అతను ముష్టి వేస్తే.. ఎవరో అవతలి వ్యక్తికి ఇన్‌చార్జి పదవి వచ్చింది. అంతేకానీ దువ్వాడ శ్రీనివాస్‌ను తలదన్నుకుని వైసీపీలో ఇన్‌చార్జిగా, ఎమ్మెల్యేగా తీసుకునే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే టెక్కలి అంటే దువ్వాడ శ్రీను.. దువ్వాడ శ్రీను అంటే టెక్కలి. ఇది అందరికీ తెలుసు’ అని దివ్వల మాధురి వివాదస్పద వాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి కుటుంబ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి మధ్య ఫ్యామిలీ డ్రామా నెలరోజులు దాటినా రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. బుధవారం ‘ఏబీఎన్-ఆంరఽధజ్యోతి’తో మాధురి మాట్లాడుతూ.. పలు ప్రశ్నలకు ఆమె బదులిచ్చిన సమాధానం.. వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. మాధురి తన మాటల్లో దువ్వాడను ఇన్‌చార్జిగా ఒకరు తీసేయడం ఏమిటండి అని ప్రశ్నించడం విశేషం. ‘శ్రీనును మళ్లీ టెక్కలి ఎమ్మెల్యేగా.. పొలిటికల్‌గా నిలబెట్టుకుని మంత్రిగా చూడాలన్నదే నా కోరిక. ఇట్స్ మై డ్రీమ్. కచ్చితంగా ఆ విధంగా అడుగులు వేస్తాం. అంతేకాదు.. వైసీపీలో ఏ పదవినైనా శ్రీను తెచ్చుకోగలడు. ప్రజల్లో శ్రీనుకు ఆదరణ ఉన్నప్పుడు ఇన్‌చార్జి పదవులు, ఇవన్నీ ఏమిటండి? శ్రీను ఇండిపెండెంట్‌గా పోటీచేసినా నిలదొక్కుకోగలడు. అంత భయపడాల్సిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి దువ్వాడ శ్రీనివాస్. ఆయన రాష్ట్రానికి రాజు, కింగ్, కింగ్‌మేకర్’ అని మాధురి పేర్కొన్నారు. కాగా మాధురి వాఖ్యలను ఆ పార్టీ నాయకులు కొందరు వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.