Share News

టీచర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:54 PM

జిల్లాలో ఆరు చైన్‌ స్నాచిం గ్‌ దొంగతనాల్లో నిందితుడైన వ్యక్తిని ఇచ్ఛాపురం, కవిటి పోలీసులు పట్టుకున్నారు.

టీచర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం/కవిటి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు చైన్‌ స్నాచిం గ్‌ దొంగతనాల్లో నిందితుడైన వ్యక్తిని ఇచ్ఛాపురం, కవిటి పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు ఆదివారం జిల్లా పోలీసు కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. డిసెంబరు16న కవిటిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ టీచర్‌పై రాయితో దాడి చేసి చైన్‌ స్నాచింగ్‌కు యత్నించిన దొంగను పట్టుకో వడంలో భాగంగా 21న కొజ్జీరియా జంక్షన్‌ వద్ద ఇచ్ఛాపురం సోదాలు నిర్వహిస్తుం డగా అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అత డిని కాశీబుగ్గ డీఎస్పీ అప్పారావు ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం పోలీసులు విచారించారు. కవిటి లో టీచర్‌పై దాడి చేయడంతో పాటు గడిచిన ఆరు నెలల్లో కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలో కంచిలిలో రెండు, కవిటిలో రెండు, ఇచ్ఛాపురంలో రెండు.. మొత్తం ఆరు దొంగతనాలకు పాల్పడి నట్టు విచారణలో నిందితుడు నర్తు రాజేష్‌ అంగీకరిం చాడని వివరిం చారు. ఈ ఆరు దొంగతనాల్లో రూ.7,76,959 విలువైన 8.25 తులాల బంగారం దొంగిలించినట్టు గుర్తించి ఆ బంగారాన్ని రికవరీ చేశామ న్నారు. గతంలో ఖతార్‌లో లేబర్‌ వర్క్‌ చేసేందుకు వెళ్లిన రాజేష్‌ ఈ ఏడాది జూలై 20న తిరిగి వచ్చాడన్నారు. రాజేష్‌ది కవిటి మండలం బైరిపురం గ్రామమని ఎస్పీ తెలిపారు.
దొంగతనాల నివారణకు చర్యలు
జిల్లాలో గడిచిన ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది చైన్‌ స్నాచింగ్‌ దొంగ తనాలు తగ్గాయని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది నమోదైన కేసులను ఛేదించామన్నారు. జిల్లాలో దొంగతనాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నిర్వ హిస్తున్నామన్నారు. కాశీబుగ్గ ఒడిశా ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఇటువంటి దొంగతనాలు జరుగుతున్నాయన్నా రు. వాటిని కూడా ఛేదిం చి నూరు శాతం దొంగతనానికి గురైన బంగారాన్ని రికవరీ చేసున్నా మన్నారు. చోరీ కేసును ఛేదించిన ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నం నాయుడు ఇచ్ఛాపురం టౌన్‌ ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు, కవిటి ఎస్‌ఐ వర్మ, ఏఎస్‌ఐ గోపాలరావు, పీసీలు ప్రసాద్‌, శ్రీను, బషీర్‌, రోణకేశ్వర రావులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.అప్పారావు, సీసీఎస్‌ ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:54 PM