Share News

threatened ఎంపీడీవోను బెదిరించిన ఎంపీపీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:04 AM

threatened కడప జిల్లా లో ఎంపీడీవోపై దాడి ఘటన మరువక ముందే.. శ్రీకాకుళం జిల్లాలో అదేరీతిలో గతంలో వైసీపీలో ఉన్న ఓ ఎంపీపీ అధికారిని బెదిరించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి అధి కారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన స్పందించారు. దీంతో ఆయనపై కేసు నమోదుచేశారు.

 threatened   ఎంపీడీవోను బెదిరించిన ఎంపీపీ

పోలీసులకు జడ్పీ సీఈవో ఫిర్యాదు

ఎచ్చెర్ల స్టేషన్‌లో కేసు నమోదు

శ్రీకాకుళం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా లో ఎంపీడీవోపై దాడి ఘటన మరువక ముందే.. శ్రీకాకుళం జిల్లాలో అదేరీతిలో గతంలో వైసీపీలో ఉన్న ఓ ఎంపీపీ అధికారిని బెదిరించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి అధి కారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన స్పందించారు. దీంతో ఆయనపై కేసు నమోదుచేశారు. ఎచ్చెర్ల మండల పరిషత్‌ అధ్యక్షుడు మొదలవలస చిరంజీవి తొలి నుంచీ దుందుడుకు స్వభావంతో వ్యవహరి స్తున్నారు. కొద్ది రోజుల కిందట ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన నిధులు.. ఇతర అభివృద్ధి పనులు.. ఉపాధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సమీక్షలో నియోజకవర్గ ఎంపీడీవోలను ఆదేశించారు. అయితే ఈ విషయమై ఎచ్చెర్ల ఎంపీపీ హోదాలో చిరంజీవి ఎంపీడీవో సీపాన హరి హరరావును తనవద్దకు పిలిపించుకుని బూతులతో బెదిరిస్తూ.. తీవ్రంగా హెచ్చరించారు. ఎమ్మెల్యే పంపిన లేఖలకు మంజూరైన పనులకు గాను ప్రతిపాదనలు పంపొద్దని.. పంపితే తీవ్ర పరిణామాలను చూడాల్సివస్తుందని హెచ్చరించడంతో పాటు చెప్పుతీసి కొడతానని ఎంపీడీవోను బెదిరించారు. ఈ పరిణామంతో ఆయన భయాందోళనకు గురై ఎచ్చెర్ల ఆసు పత్రిలో చేరారు. ఈ విషయం ఇటు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరంఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుసుకుని ఎంపీడీవోకు భరోసా ఇచ్చి.. ఎటువంటి బెది రింపులకు గురికాకుండా స్వేచ్ఛగా పనిచేయాలని ధైర్యం కల్పించారు. అప్పటికే విషయం కలెక్టర్‌కు చేరడంతో విచా రణకు ఆదేశిం చారు. జడ్పీ సీఈవో శ్రీధర్‌బాబు.. విషయం సేకరించి.. ఎంపీడీవో నుంచి వివరాలు తీసుకుని కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఎంపీడీవోను బెదిరించిన ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై కలెక్టర్‌ ఆదేశాలతో జడ్పీ సీఈవో ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఎంపీపీపై బీఎన్‌ఎస్‌ 132, 351(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ స్పష్టం చేశారు.

అప్పుడూ.. ఇప్పుడూ

ఎంపీపీ మొదలవలస చిరంజీవి న్యాయవాది. అయితే వైసీపీలో చేరి ఎంపీపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వైశ్య యువకుడిని కిడ్నాప్‌ చేసి.. ఖాళీ స్టాంపు పత్రాలపై సంత కాలు చేయించుకుని.. ఆయన్ను చితకబాది విడిచి పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఆ ఘటన బయటకు రావడంతో శ్రీకాకుళం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి మిన్న కుండిపోయారు. పోలీసులు కూడా పెద్దగా పట్టించు కోకుండా అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో మమ అనిపించేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీకి చెందిన ద్వితీ య స్థాయి నాయకుడిపై హత్యాయత్నం చేయడంతో ఎంపీపీపై కేసు నమోదైంది. ఆ తరువాత ఆయనను వైసీపీ నుంచి తప్పించారు. అప్పుడూ.. ఇప్పుడూ రౌడీ యిజం ప్రదర్శిస్తుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:04 AM