Share News

ఆక్సిజన్‌ ప్లాంట్‌ మూలనపడడంపై ఎమ్మెల్యే అసంతృప్తి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:46 PM

సామాజిక ఆసుపత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌, జనరేటర్‌ మూలకు చేరడంపై ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ మూలనపడడంపై ఎమ్మెల్యే అసంతృప్తి
ఆసుపత్రి భవనాలను పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

భవనాల నిర్మాణంలో జాప్యంపైనా..

నరసన్నపేట: సామాజిక ఆసుపత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌, జనరేటర్‌ మూలకు చేరడంపై ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. సోమవారం ఆయన సామాజిక ఆసుపత్రి భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్‌ లేని సమయంలో ఆసుపత్రిలో రోగులు పడే ఇబ్బందులు గత పాలకులకు కనిపించకపోవడం దారుణమన్నారు. జనరేటర్‌ను బాగు చేసేం దుకు వెంటనే అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణానికి మంజూరైన నిధులను మళ్లించి పనులు మధ్యలో నిలిపి వేయడంపై ఆయన విస్మయం చెందారు. 2020లో ఆసుపత్రి నిర్మాణాలు ప్రారంభించినా గత పాలకులు నాబార్డు నిధులు మళ్లించడంతో భవన నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని, పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని ఈఈ సత్యప్రభాకర్‌ అన్నా రు. సుమారు రూ.4 కోట్లు బకాయిలున్నా యన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి వచ్చే నిధులు ఖర్చు చేయకుండా ఎలా నిర్వహణ చేశారని వైద్యులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆసు పత్రిలో సేవలు విస్తృతం చేసి రోగులకు నమ్మకం కలిగించా లని కోరారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీఎస్‌ డీఈఈ శిమ్మన్న, ఏఈ వెంకటేష్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జయశ్రీ, డా.పాగోటి శంకరరావు ఏవో రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:46 PM