Share News

చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రికి లేదు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:14 AM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌, గౌతు శివాజీ, శిరీష కుటుంబాలను మంత్రి అప్పల రాజు విమర్శించడం సిగ్గుచేటని, వారిని విమర్శించే స్థాయి మంత్రికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎన్నికల శంఖారావం సభ విజయవంతం కావడంతో మంత్రి ఓర్వలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ మెప్పుకోసమే మంత్రి తమ నాయకులను తూలనాడు తున్నారని, డాక్టర్‌గా హుందాగా ఉండాలే తప్ప యాక్టర్‌గా వెకిలివేషాలు వేయవద్దని సూచించారు. తమ నాయకుడి సభ ముగియకముందే పోటీ సమావేశం నిర్వహించి విమర్శలు చేయడం సరి కాదని, నాయకులు మంత్రికి వేసిన ప్రశ్నలు ఏమిటి మీరిచ్చిన సమాధానం ఏమిటని ప్రశ్నించారు. ఐదేళ్లలో మంత్రి ఆస్తులు కూడబెట్టుకున్నారని, అంత ధనం సంపాదన వెనుక రహస్యం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై సమాధానం చెప్పమంటే మంత్రి అసహనంతో వ్యంగ్య లేఖలు రాయడాన్ని ప్రజలు గుర్తించారని, ప్రజాక్షేత్రంలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు.

  చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రికి లేదు
మాట్లాడుతున్న వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు :

పలాస: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌, గౌతు శివాజీ, శిరీష కుటుంబాలను మంత్రి అప్పల రాజు విమర్శించడం సిగ్గుచేటని, వారిని విమర్శించే స్థాయి మంత్రికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎన్నికల శంఖారావం సభ విజయవంతం కావడంతో మంత్రి ఓర్వలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ మెప్పుకోసమే మంత్రి తమ నాయకులను తూలనాడు తున్నారని, డాక్టర్‌గా హుందాగా ఉండాలే తప్ప యాక్టర్‌గా వెకిలివేషాలు వేయవద్దని సూచించారు. తమ నాయకుడి సభ ముగియకముందే పోటీ సమావేశం నిర్వహించి విమర్శలు చేయడం సరి కాదని, నాయకులు మంత్రికి వేసిన ప్రశ్నలు ఏమిటి మీరిచ్చిన సమాధానం ఏమిటని ప్రశ్నించారు. ఐదేళ్లలో మంత్రి ఆస్తులు కూడబెట్టుకున్నారని, అంత ధనం సంపాదన వెనుక రహస్యం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై సమాధానం చెప్పమంటే మంత్రి అసహనంతో వ్యంగ్య లేఖలు రాయడాన్ని ప్రజలు గుర్తించారని, ప్రజాక్షేత్రంలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:14 AM