Share News

ప్రజల భూములను కాజేసేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌

ABN , Publish Date - May 07 , 2024 | 12:24 AM

ప్రజల భూములను కాజేసేందుకే సీఎం జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను తీసుకువచ్చారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ అన్నారు.

ప్రజల భూములను కాజేసేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ

అరసవల్లి: ప్రజల భూములను కాజేసేందుకే సీఎం జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను తీసుకువచ్చారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ అన్నారు. సోమవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోను ఈ యాక్ట్‌ అమలు చేయలేదని, మరి ఆ చట్టాన్ని అమలు చేసేం దుకు జగన్‌కు ఎందుకంత తొందర అని ప్రశ్నించారు. ఇది భూరక్ష చట్టం కాదు భూభక్ష చట్టమని విమర్శించారు. టీడీపీని గెలిపించి భూములపై హక్కులను కాపాడుకుందామని అన్నారు. ఒక్క జగన్‌ బినామీ కంపెనీకి రామాయపట్నం పరిసరాల్లో 8500 ఎకరాలను కారు చౌకగా భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపుదామన్నారు. సమావేశంలో రాష్ట్ర తెలుకల సాధికార సమితి డైరెక్టర్‌ కొమ్మనాపల్లి వెంకటరామరాజు, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు గోర అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 12:24 AM