Share News

ఆదిత్యుని హుండీల ఆదాయం రూ.43.09 లక్షలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:11 AM

ఆరోగ్యప్రదాత అర సవల్లి సూర్యనారా యణ స్వామివారి హుండీల లెక్కింపు గురువారం ఆలయ అనివెట్టి మండపం లో జరిగింది.

ఆదిత్యుని హుండీల ఆదాయం రూ.43.09 లక్షలు

అరసవల్లి: ఆరోగ్యప్రదాత అర సవల్లి సూర్యనారా యణ స్వామివారి హుండీల లెక్కింపు గురువారం ఆలయ అనివెట్టి మండపం లో జరిగింది. 31 రోజులకు గాను రూ.43,09,655 ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందులో నోట్లు రూపేణా రూ.41,45,262, చిల్లర రూపంలో రూ.1,64,393 లభించాయి. బంగారం 61 గ్రాములు, వెండి 1.6 కిలోలు, యూఎస్‌ డాలర్స్‌ 18 లభించాయన్నారు. కార్యక్రమం లో ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకు లు ఇప్పిలి శంకరశర్మ, దేవదాయశాఖ ఏసీ ప్రసాదరావు పట్నాయక్‌, పాలకమండలి సభ్యులు లుకలాపు గోవిందరావు, నెమలపురి కోటేశ్వరరావు, జటగడుగుల శ్రీనివాస్‌, దేవదాయశాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌, ఆలయ అర్చకులు, సిబ్బంది, శ్రీహరిసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:11 AM