Hackathon ముగిసిన హ్యాక్‌థాన్ పోటీలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:02 AM
Hackathon స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల (ఐతమ్)లో మూడు రోజులుగా జరుగుతున్న ‘ఆవిష్కార్ సీజన్-2’ హ్యాక్‌థాన్ పోటీలు సోమవారంతో ముగిశాయి.

టెక్కలి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల (ఐతమ్)లో మూడు రోజులుగా జరుగుతున్న ‘ఆవిష్కార్ సీజన్-2’ హ్యాక్‌థాన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 51 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 186 మంది విద్యార్థులు పాల్గొని వివిధ సమస్యలకు పరిష్కారం చూపారు. వీటిలో ఆక్వా నీటి యంత్రం ద్వారా అందులో నీటిని సేకరించే ఐడియాతో వచ్చిన కోయంబత్తూరుకు చెందిన శ్రీ ఈశ్వర్ కాలేజ్ బృందానికి మొదటి బహుమతి లభించింది. ఈ బృందానికి రూ.1.25లక్షల నగదు ప్రశంసా పత్రాలను అందించారు. అలాగే మహరాజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం, ముంబై ఏసీ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు వరుసగా రెండు, మూడు బహుమతులు సాధించారు. ఆదిత్య, ఎస్‌వీ ఎన్‌ఐటీ సూరత్ కళాశాలలు కన్సోలేషన్ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో కళా శాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, డైరెక్టర్ వీవీ నాగేశ్వర రావు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సంద ర్భంగా స్టార్టప్ మెంటార్ మనోజ్ కుమార్ బడగర్ వాలా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరిగిన ఈ హ్యాక్‌థాన్ పోటీ ల్లో యువ ఇంజనీర్లు పాల్గొనడమే పెద్ద విజయమ న్నారు. స్టార్టప్ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. న్యాయనిర్ణేతలుగా క్వాలీవాన్ టెక్నాలజీస్ సీఈవో బత్తుల సందీప్, సీనియర్ ఎనలిస్ట్ సుష్మ బడగర్ వాలా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు, కో-ఆర్డినేటర్ డాక్టర్ సతీష్‌కుమార్, డాక్టర్ ఎంవీ కుమార్, సురేష్‌కుమార్, గిరీష్‌కుమార్, సాయిశ్రీ తదితరులు వ్యవహరించారు.