Share News

బాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:46 PM

బాబుతోనే భవిష్యత్‌ సాధ్యమని పలువురు నేతలు అన్నారు. బుధవారం వివిధ గ్రామాల్లో బాబు ష్యూరిటీ, సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృతంగా అవగాహన కలిగించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

బాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
సోంపేట: టీడీపీ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

బాబుతోనే భవిష్యత్‌ సాధ్యమని పలువురు నేతలు అన్నారు. బుధవారం వివిధ గ్రామాల్లో బాబు ష్యూరిటీ, సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృతంగా అవగాహన కలిగించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

మహిళల అభ్యున్నతికి టీడీపీ కృషి: ఎమ్మెల్యే

సోంపేట, మార్చి 5: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం సోంపేట పట్టణంలో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత నూకాలమ్మ కొండపై ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని డాబా కాలనీలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించారు. మహిళల అభ్యు న్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్‌, పార్టీ మండల అధ్యక్షుడు మద్దిల నాగేష్‌, నాయకులు చిత్రాడ శ్రీనివాసరావు, బొడ్డ రాంకుమార్‌, ఊట్ల మోహన్‌ గాంధీ, దూసి మధు తదితరులు ఉన్నారు.

సంతబొమ్మాళి: టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న అన్నారు. బుధవారం ఆర్‌.మరువాడలో టీడీపీ అమలు చేయనున్న సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పిం చారు. టీడీపీ హయాంలోనే ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందా యన్నారు. కార్యక్రమంలో నాయకులు సూరాడ దాసురాజు, సూరాడ ధనరాజ్‌, తెలుగుయువత మండల అధ్యక్షుడు కూశెట్టి భాను ప్రకాష్‌, ఐటీడీపీ అధ్యక్షుడు బెండి అరుణ్‌కుమార్‌, వజ్జ ప్రభాకర్‌, దుపాన రమణారెడ్డి పాల్గొన్నారు.

టెక్కలి: టీడీపీతోనే ప్రజలకు భవిష్యత్‌ అని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి అన్నారు. బుధవారం గూడేం పంచాయతీ సన్యాసినీలాపురం, సవరకిల్లి గ్రామాల్లో బాబు సూపర్‌సిక్స్‌ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

జలుమూరు: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. బుధవారం బుడితి గ్రామంలో బుధవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నిర్వహించారు. టీడీపీ, జనసేన నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు రావడంతో వైసీపీ నాయకుల్లో వణుకుపుట్టిం దన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముద్ద భీమారావు, చల్ల ఆనందరావు, డి.జయరాం, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

జి.సిగడాం: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణం సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు కూనుబిల్లి కూర్మారావు అన్నారు. బుధవారం పెంట, బాతువ, డీఆర్‌ వలస, దవళపేట తదితర గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటీకి వెళ్లి టీడీపీ సూపర్‌ సిక్స్‌ పఽథకాలపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కంచరాన సూరన్నా యుడు, మీసాల విజయమ్మ, కోనారి సత్యనారాయణ, సిరిపురపు ఉపేంద్ర, కోరాస సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సరుబుజ్జిలి: మూలసవలాపురం గ్రామ పంచాయతీ వ్యాసులపేట గ్రామంలో టీడీపీ జిల్లా అధికారప్రతినిధి కూన సంజీవరావు ఆధ్వర్యంలో బుధవారం సూపర్‌ సిక్స్‌ శంఖారావం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో బుధవారం కలిసి నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను గెలిపించాలని కోరారు.

Updated Date - Mar 06 , 2024 | 11:46 PM