కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:19 AM
శిక్షలు శాతం పెరిగేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులే కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. కోర్టు విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యత, అంకితభావంతో పని చేయాలని సూచించారు.
- శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి
- ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): శిక్షలు శాతం పెరిగేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులే కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. కోర్టు విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యత, అంకితభావంతో పని చేయాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్ల వారి కోర్టు కానిస్టేబుల్, కోర్టు సమన్వయ సిబ్బందితో కోర్టు కేసుల విచారణ, సమన్స్, వారెంట్స్ అమలు, సాక్ష్యాలను కోర్టులో హాజరుపరచడం, కేసు అభియోగ పత్రాలు దాఖలు, వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు వంటి అంశాలపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ అంకిత భావంతో పనిచేస్తూ శిక్షల శాతం పెంచేలా శ్రమించాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారంట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కేసు విచారణ సమయంలో సాక్షులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వద్ద ప్రవేశ పెట్టి బ్రీఫింగ్ ఇవ్వాలన్నారు. పెండింగ్ కేసులు లేకుండా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానటరింగ్ సిస్టం వారు చర్యలు తీసుకోవాలన్నారు. దర్యాప్తు అధికారులు కోర్టుకి హాజరయ్యేలా చూసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ పారినాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.