డీలర్‌ను వెంటనే తొలగించాలి
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:08 AM
లక్ష్మీపురం గ్రామ రేషన్ డిపో డీలర్‌ను వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
లావేరు: లక్ష్మీపురం గ్రామ రేషన్ డిపో డీలర్‌ను వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గు రువారం ఆ గ్రామ సచివాలయం వద్ద వారంతా ఆ ందోళన చేపట్టారు. లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలకు చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులకు గత నాలుగు నెలలుగా బయోమెట్రిక్ వేయింంచుకుని కందిపప్పు ఇవ్వకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసు కుంటున్నారని ఎండీఎం ఆపరేటర్‌ను నిలదీశారు. ఈ విషయమై ఈ నెల 18న కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా స్ధానిక రెవెన్యూ అధికారులు పటించుకోవడం లేదన్నారు. ఈ డీలర్ పై ఎన్నోసార్లు అక్రమాలు రుజువైనా చర్యలు తీసుకోకపోవడంపై వారంతా మండిపడుతున్నారు.