Share News

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:44 PM

నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిం చాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రదాన కార్య దర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మికుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ మూర్తి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి రెండో రోజుకు చేరుకున్నాయి.

 భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించాలి
రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న తేజేశ్వరరావు

నరసన్నపేట: నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిం చాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రదాన కార్య దర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మికుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ మూర్తి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో భవన నిర్మాణ కార్మికులు దుర్భరమైన జీవనం సాగిస్తున్నారన్నారు. కార్మిక సంక్షేమ నిఽధులు కార్మికులకే వినియోగిం చాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తర్ల లక్ష్మణరావు, శిమ్మ ఉమా, పైల రాము, వాన అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:45 PM