Share News

కుట్ర బయటపడింది

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:35 PM

అధికార పార్టీ దర్పం.. అధికారం మదంతో చేసిన కుట్ర బయటపడింది. తాను ఎంతటి ఘనకార్యం చేశాన న్నదో.. సొంత పార్టీనేతల వద్దనే బయటపెట్టుకోగా.. అదే ఇప్పుడు ఆడియోగా వైరల్‌ అవుతోంది.

కుట్ర బయటపడింది

ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/టెక్కలి, ఫిబ్రవరి 17: అధికార పార్టీ దర్పం.. అధికారం మదంతో చేసిన కుట్ర బయటపడింది. తాను ఎంతటి ఘనకార్యం చేశాన న్నదో.. సొంత పార్టీనేతల వద్దనే బయటపెట్టుకోగా.. అదే ఇప్పుడు ఆడియోగా వైరల్‌ అవుతోంది. ఇంతకూ అసలు విషయానికొద్దాం. టెక్కలి వైసీపీ నాయకుడు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ దుందు డుకు స్వభావం తెలిసిన విషయమే. తాజాగా తాను మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ.. ఇటు వైసీపీ, టీడీపీ నాయ కులు, ప్రజల సెల్‌ఫోన్లలోనూ సంచలనమైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని, తెలుగు దేశం పార్టీ కేడర్‌ను తాను ఎలా ఇబ్బందులు పెట్టానో అన్నది ఆడియోలో స్పష్టమైంది.

ఆడియోలో.. ఎమ్మెల్సీ దువ్వాడ సంభాషణ ఇదీ...
‘సంతబొమ్మాళి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాసరావును గట్టిగా హెచ్చ రించా. బయటకు వస్తే అంతు చూస్తా అని హెచ్చరికతో పాటుగా అతనిపై రౌడీషీట్‌ కూడా తెరి పించి అరెస్ట్‌ చేయించాం. ఇక కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యంను ఇంటిలోనే తలుపులు వేయించి బంధించగలిగాం. అదే రీతిన నందిగాం, టెక్కలి జడ్పీటీసీ అభ్యర్థులను కూడా బయటకు రానీయకుండా చేశాం. తెలుగుదేశం కేడర్‌ ఎవరినీ బయటకు రానీయకుండా చేయగలిగా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా చేయడంతోనే టెక్కలి నియో జకవర్గంలో నాలుగు జడ్పీటీసీలను, 119 పంచాయతీలను గెలిపించుకోగలిగాం. లేకుంటే అన్ని స్థానాలు వైసీపీకి రావు. కేవలం 55 సర్పంచ్‌ స్థానాలు మాత్రమే వైసీపీకి చెందినవారు గెలుస్తారని ముందుగా తెలి సింది. మిగిలినవి టీడీపీ గెలిచే అవకాశముందని వెల్లడైంది. అప్పుడు ఏం చేయా లన్నదీ ఆలోచించి.. ఇదంతా చేశా. అచ్చెన్నాయుడు సొంతూరు నిమ్మాడ లో వైసీపీకి మద్దతుగా ఉన్న కింజరాపు అప్పన్నతో సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయ కుండా టీడీపీ వాళ్లు ఇబ్బంది పెట్టారు. దీంతో ఇదే అవకాశంగా ఆ ఊరిపైనే నేను దాడి చేసి.. అప్పన్నతో నామినేషన్‌ వేయించా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దాడి చేశారని చెప్పించి అతన్ని జైల్లో వేయించా. తెలుగుదేశం వారిని భయపెట్టగలగి రౌడీయిజం చేశాం’.

Updated Date - Feb 17 , 2024 | 11:35 PM