Share News

సీఎం హామీ నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:11 AM

పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సమస్యలను పరిష్క రించాలని కోరుతూ మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు పదో రోజు గురువారం సమ్మె చేపట్టారు.

సీఎం హామీ నిలబెట్టుకోవాలి
పలాస: అర్ధనగ్న ప్రదర్శనతో ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

కాశీబుగ్గ/పలాస, జనవరి 4: పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సమస్యలను పరిష్క రించాలని కోరుతూ మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు పదో రోజు గురువారం సమ్మె చేపట్టారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం నుంచి పలాస మునిసిపల్‌ కార్యాలయం వరకు పారిశుధ్య కార్మికులు అర్ధనగ్నంగా ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణపతి, సీపీఐ నాయ కులు చాపర వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రావు, పారిశుధ్య కార్మిక సంఘ నేతలు మురుగన్‌, రవి, దివాకర్‌, శంకర్‌ పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం: కార్మికుల సమస్యలు పరిష్కారంలో విఫల మైన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని సీఐటీయూ జిల్లా నాయకుడు రమేష్‌ పట్నాయక్‌ తెలిపారు. గురు వారం ఇచ్ఛాపురంలో పదో రోజు సమ్మెలో భాగంగా పారిశుధ్య కార్మికులు ఇచ్ఛాపురం బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేశారు.
ఆమదాలవలస: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పదో రోజు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. గురువారం స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రధాన రహదారిపై సంఘ అధ్యక్షుడు కె.సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మి కులు మానవహారం నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల సంఘ నాయకులు తారకేశ్వరరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:11 AM