ఎన్నికల హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:05 PM
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్‌రావు, సీపీఐ నాయకుడు వేణుగోపాల్ విమర్శించారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించారు.
కాశీబుగ్గ: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్‌రావు, సీపీఐ నాయకుడు వేణుగోపాల్ విమర్శించారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్, అటవీ సంపదలను, రవాణా, బ్యాంకు లు, ఎల్‌ఐసీ తదితర సంస్థలన్నింటినీ ఆదానీ, అంబానీ తదితర కార్పొ రేట్ సంస్థ లకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖకు రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోగా తెలుగు ప్రజలు పోరాడి సాధించు కున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా అమ్మకానికి పెడతారని ప్రశ్నిం చారు. వీటిని వ్యతిరేకిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త సమ్మె చేపడుతు న్నామని, దీనిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో ఆయా సంఘాల నేతలు రామారావు, సన్యాసిరావు, బాలకృష్ణ, వినోద్‌కుమార్, కుసుమ, నాగేశ్వరరావు తదితరులుపాల్గొన్నారు.