Share News

ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్‌

ABN , Publish Date - Nov 07 , 2024 | 11:20 PM

ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు.

ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్‌
కొత్త బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి/శ్రీకాకుళం రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శ్రీకాకుళం నుంచి పలాస వెళ్లే పాసింజర్‌ బస్సును గురువారం జెండా ఊపి ప్రారంభించారు.

- మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం దీపం పథకానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలి పారు. దమ్మలవీధిలో గ్యాస్‌ సిలెండ ర్లను పంపిణీ చేశారు.

- ఆచార్య ఎన్జీ రంగా రైతు బాంధవుడిగా పేరు గాంచారని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలి పారు. రంగా జయంతి పురస్కరించు కుని శాంతినగర్‌ కాలనీలోని ఆయన విగ్రహాన్ని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నంతో కలిసి ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధులు సురంగి మోహనరావు, జామి భీమ శంకర్‌, నటుకుల మోహన్‌, కొంక్యాన వేణు గోపాల్‌ పాల్గొన్నారు.

- ప్రతి ఇంటికి జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా తాగు నీరందిం చడమే ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం కిష్టప్పపేటలో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించారు.

Updated Date - Nov 07 , 2024 | 11:20 PM