Share News

తక్షణమే నిందితులను అరెస్టు చేయాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:45 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు దాడిచేయడాన్ని ఖండిస్తూ జిల్లావ్యాప్తంగా మంగళ వారం జర్నలిస్టులు, పలు సంఘాల, టీడీపీ నాయకులు నిరసన తెలి పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్‌చేశారు.

తక్షణమే నిందితులను అరెస్టు చేయాలి
నరసన్నపేట: అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న నరసన్నపేట ప్రెస్‌క్లబ్‌ సభ్యులు

అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు దాడిచేయడాన్ని ఖండిస్తూ జిల్లావ్యాప్తంగా మంగళ వారం జర్నలిస్టులు, పలు సంఘాల, టీడీపీ నాయకులు నిరసన తెలి పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్‌చేశారు.

దాడి అమానుషం : కళా

రణస్థలం: విధినిర్వహణలో ఉన్న రాప్తాడు ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకదాడి చేసి తీవ్రంగా గాయపరచడం అమానుషమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు, టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు మండిప డ్డారు.కమ్మసిగడాం మహాలక్ష్మీతల్లిని దర్శించుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వ్యక్తులపై దాడులు చేయడం వైసీపీ మూకలకు అలవాటు అయ్యిందని, ప్రభుత్వా నికి, ప్రజలకు వారధిగా పనిచేసే విలేకరులపై దాడికి పాల్పడిన వ్యక్తు లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో తోటపల్లి కాలువ ద్వారా నీరుతెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. వైసీపీ పాలనలో చుక్క నీరు ఇవ్వలేక పోయారని విమర్శించారు.

దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి: జల్లు

గార: ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడి శోచనీయమని, ఈ సంఘటనను ప్రతిఒక్కరూ ఖండించాలని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్‌ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. పత్రికా స్వేచ్చకు భంగం కలిగించే ఇటువంటి చర్యలు భవిష్య త్‌లో జరగకుండా చూడాలని కోరారు.

ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ: జయదేవ్‌

ఇచ్ఛాపురం:రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి ప్రజాస్వామ్యా నికే మాయని మచ్చ అని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్‌ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా కు గౌరవం ఇవ్వకుండా కక్షపూరితంగా కొన్ని పత్రికలపై ప్రత్యేకించి దృష్టి పెట్టి దాడులు చేయటం దుర్మార్గపు చర్య అని అన్నారు. కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్స్‌ వింగ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఊనా సంతోష్‌కుమార్‌, పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు సాలిన జగదీష్‌యాదవ్‌, టీపీడబ్ల్యూ నియోజకవర్గ కీలక సభ్యులు పైల నారాయణ, జయదేవ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

అభద్రతా భావంతోనే దాడి: గొండు శంకర్‌

అరసవల్లి:ముఖ్యమంత్రిజగన్‌రెడ్డి సభకు మద్యం,డబ్బు వెదజల్లినా ప్రజలు రాలేదని, వచ్చిన వారు కూడా మధ్యలోనే వెళ్లిపోతున్నారని, ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని అభద్రతా భావంతోనే ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసీపీ రైడీ మూకలు దాడికి పాల్పడ్డాయని టీడీపీ నాయకుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ విమర్శించారు.మంగళవారం శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుత వైసీపీకి రోజులు దగ్గర పడుతున్నందు వల్లనే అసహనంతో ఇటువంటి పనులకు పాల్పడుతు న్నారని తెలిపారు. తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బొల్లా నాగేంద్ర యాదవ్‌, ఎండు చిన్నారావు, రాయి కిరణ్‌, పొన్నాడ కిషోర్‌, ప్రసాద్‌, మైలపిల్లి నరిసింహమూర్తి, రవి పాల్గొన్నారు.

ఫ నరసన్నపేట: అనంతరపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో ఆ పార్టీ మూకలు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేయడం అమానుషమని, దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే నరసన్నపేట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు టీవీ చంద్రమోహన్‌దేవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి తహసీల్దార్‌ కనకారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ప్రెస్‌క్లబ్‌ సభ్యు లు బి.జయవర్ధన్‌, తాతాజీ, కిరణ్‌, గణేష్‌, నెయ్యల నారాయణరావు, బి.నారాయణరావు, గోపాల కృష్ణ, బుజ్జి, డానియల్‌, సంతోష్‌ , కేశవరాజు, రామ్మోహనరావు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతి

ఆమదాలవలస: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై కొంత మంది రౌడీమూకలు కర్రలు, చేతులతో దాడి చేయడం తగదని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు పేడాడ పూర్ణారావు పేర్కొన్నారు.మంగళవారం ఆమదాలవలస వన్‌వే జంక్షన్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి విలేకురులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి దుప్పల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు సనపల శ్రీనివాసరావు,విలేకరులు అన్నంనాయుడు, జగ్గునా యుడు, సనపల చం ద్రశేఖర్‌, మోహన్‌రావు, పాత్రుని రామ్మోహన్‌రావు, రమేష్‌, దుర్గారావు పాలొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:45 PM