తెలగ కులస్థులను బీసీలో చేర్చాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:20 PM
తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని ఆ సంఘ నేత, బీసీ సాధన సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు డిమాండ్ చేశారు.
ఎచ్చెర్ల: తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని ఆ సంఘ నేత, బీసీ సాధన సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురంలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర ఎచ్చెర్ల, చిలకపాలెం మీదుగా మంగళవారం సాగింది. చిలకపాలెం జంక్షన్ వద్ద అరిణాం అక్కివలస గ్రామ టీడీపీ అధ్యక్షుడు గట్టెం శివరామ్ ఆధ్వర్యంలో పాదయాత్రకు స్వాతగం పలికి.. పొందూరు మండలం గారపేట వరకు వారితో పాటు నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నింటా వెనుకబడిన తెలగ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో తెలగ కుల సంఘ నాయకులు లంకలపల్లి ప్రసాద్, గట్టెం రమేష్, పుణ్యపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.