Share News

తెలగ కులస్థులను బీసీల్లో చేర్చాలి

ABN , Publish Date - Feb 05 , 2024 | 11:58 PM

ఉత్తరాంధ్రలో దారిద్యరేఖకు దిగువన ఉనం్న తెలగ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని ఆ సంఘ నాయకుడు, బీసీ సాధన సమితి అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు డిమాండ్‌ చేశారు.

తెలగ కులస్థులను బీసీల్లో చేర్చాలి
సంఘీభావం తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

శ్రీకాకుళం అర్బన్‌: ఉత్తరాంధ్రలో దారిద్యరేఖకు దిగువన ఉనం్న తెలగ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని ఆ సంఘ నాయకుడు, బీసీ సాధన సమితి అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు డిమాండ్‌ చేశారు. బీసీ సాధనలో భా గంగా ఇచ్ఛాపురం నుంచి ఆయన ప్రారంభించిన పాదయాత్ర శ్రీకాకుళం చేరుకున్న సందర్భంగా స్థానిక ఓ కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడారు. 1962 వ రకు బీసీలో ఉన్న తెలగ కులస్థులను ఆ తర్వాత తొలగించడం అన్యాయమన్నారు. దీంతో విద్య, ఉపాధితో పాటు అన్ని రంగాల్లో తెలగ కులస్థులు వెనుకబడి పోయా రని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పెద్దపాడు రోడ్డు నుంచి సూర్యమహల్‌ కూడలి మీదుగా ఏడురోడ్ల జంక్షన్‌కు చేరుకుని తమ డిమాండ్లను నినాదాల రూపంలో తెలియజేశారు. క్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మద్దతు తెలిపారు. అనంతరం ఏడురోడ్ల కూడలి నుంచి డే అండ్‌ నైట్‌ మీదుగా జాతీయ రహదారి వద్ద గల సింహద్వారం మీదుగా ఎచ్చెర్ల వైపు పాదయాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో తెలగ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు, నాయకులు రాజేంద్రదాస్‌, జనా ర్దనరావు, శవ్వాన ఉమామహేశ్వరి, రాంబాబు, సుంకరి కృష్ణ, మునుకోటి సత్యనారాయణ, పిల్లల నీలాద్రి, పుట్టా అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2024 | 11:58 PM