Share News

వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:31 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల కష్టాలు తొలగిపోతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల కష్టాలు తొలగిపోతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. గురు వారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. రూ.13లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్‌ రెడ్డి.. ఆ డబ్బుతో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ మునిగిపోతున్న నావలా తయారైం దన్నారు. వైసీపీ తప్పిదాలను టీడీపీకి, చంద్రబాబు కు ఆపాదించడం సరికాదన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్న చిరు ఉద్యోగు లపై కఠిన చర్యలకు పాల్పడ డం ఎంతవరకు సమంజసమన్నారు. సైకో సీఎం ప్రవర్తనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు అన్ని విధాలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ప్రజ లు కూడా బాబు సభలకు సంపూర్ణ మద్ధతు పలుకు తున్నారని చెప్పారు. అన్ని వ్యవస్థలను జగన్‌రెడ్డి నాశనం చేశారని.. ప్రభుత్వం మారకుంటే మరింత ఇబ్బందికర పరిస్థితిని రాష్ట్రం చవిచూస్తుందన్నారు. టీడీపీ నిర్వహిస్తున్న ‘రా.. కదలిరా’ సమావేశాలకు అందుకే తండోపతండాలుగా హాజరై బలంగా చంద్ర బాబుకి మద్ధతు ఇస్తున్నారని వెల్లడించారు. సమా వేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:31 AM