టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 24 , 2024 | 11:44 PM
టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. గురువారం పట్టణంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
నరసన్నపేట, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. గురువారం పట్టణంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురైన నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు ప్రసాదరావు కుటుంబానికి సీఎం రిలీప్ ఫండ్ కింద రూ.70వేలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, పార్టీ మండలాధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్, కింజరాపు రామా రావు, గొద్దు చిట్టిబాబు, బెవర రాము, సాసుపల్లి కృష్ణబాబు, పీస కృష్ణ, జామి వెంకట్రావు, ఉణ్న వెంకటేశ్వరరావు, బోయన సతీష్, ఆనంద్ పాల్గొన్నారు.
ఫ పోలాకి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాదబీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం ఈదులవలస జంక్షన్‌లో జరిగిన కార్యకర్తల శిక్షణ శిబిరంలో పరిశీలకుడిగా హాజరై మాట్లాడారు. పార్టీ మండలాధ్యక్షుడు ఎంవీ నాయుడు అధ్యక్షతన జరిగిన సభ్యత్వ శిక్షణ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు నిర్వాహకురాలు బగ్గుఅర్చన సభ్యత్వ నమోదుపై వివరించారు. కార్యక్రమంలో సభ్యత్వ శిక్షకులు లీలామోహన్, ఎంవీనాయుడు, తమ్మినాన భూషణరావు, ఆర్‌కేనాయుడు, బి.అర్చన బైరిబాస్కరరావు, కరుకోలరమేష్‌బాబు పాల్గొన్నారు.