Share News

రికార్డు మెజార్టీపై టీడీపీ ఆశలు

ABN , Publish Date - May 15 , 2024 | 11:55 PM

నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత శాస నసభ్యుల మెజార్టీలన్నింటినీ తుడిచిపెట్టి రికా ర్డు స్థాయి మెజార్టీ సాధిస్తుందనే అంచనాలు టీడీపీ శ్రేణులు వేస్తూ ఆశల పల్లకిలో ఊరేగు తున్నారు.

రికార్డు మెజార్టీపై టీడీపీ ఆశలు

- విజయంపై వైసీపీ ధీమా

- ఆమదాలవలస నియోజకవర్గంలో గెలుపోటములపై చర్చ

ఆమదాలవలస: నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత శాస నసభ్యుల మెజార్టీలన్నింటినీ తుడిచిపెట్టి రికా ర్డు స్థాయి మెజార్టీ సాధిస్తుందనే అంచనాలు టీడీపీ శ్రేణులు వేస్తూ ఆశల పల్లకిలో ఊరేగు తున్నారు. అలాగే ఈసారి 2019 శాసనసభ ఎన్నికల్లో సాధించిన 13,991 ఓట్ల మెజార్టీ రాకపోయనా కనీస మెజార్టీతోనైనా అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుంటామని ధీమాలో వైసీపీ శ్రేణులు అంచనాలు వేస్తున్నాయి. ఆమదాలవ లస నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు 2009 సం వత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి, టీడీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై సాధించిన 16,209 మెజార్టీ ఇప్పటివరకు అత్య ధికంగా ఉండగా, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్య ర్థి తమ్మినేని సీతారాం, కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డేప ల్లి సత్యవతిపై సాధించిన 1,511 ఓట్ల మెజార్టీ తో అత్యల్పంగా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలు గు మండలా లతోపాటు ఆమదాల వలస మున్సి పాలిటీ పరిధిలోని ఉన్న 259 పోలింగ్‌ కేంద్రాల్లో 1,93,858 ఓటర్లు ఉండగా 1,54,225 మంది ఓటర్లు ఓటు హక్కును వినియో గించుకున్నారు. అసెంబ్లీ బరిలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 13 మంది అభ్య ర్థులు పోటీ చేసినా.. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. కాంగ్రెస్‌, బీఎస్పీ వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల్లో నిలిచినప్పటికీ వైసీపీను వీడి స్వతంత్య్ర అభ్యర్థి గా నామినేషన్‌ వేసిన సువ్వారి గాంధీ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గాంధీకి కూడా సుమారు పది వేల ఓట్లు ల భించే అవకాశం ఉందని ఆయన అనుచరులు కూడా అంచనాలు వేస్తున్నారు. నియోజక వర్గంలోని పొందూరు, ఆమదాలవలస మండ లాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలో స్వతం త్య్ర అభ్యర్థి గాంధీకి ఓట్లు లభించే అవకాశాలు ఉండడంతో ఈ ప్రభావం వైసీపీ అభ్యర్థికి కొంతమేర నష్టం వాటిల్లే అ వకాశం ఉన్నట్టు పలువు రు అభిప్రాయపడుతు న్నారు. 2019 జరిగిన ఎ న్నికల్లో 79.10 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఇటీవల జరిగిన ఎన్ని కల్లో 79.54 శాతం ఓట్లు నమోదు కా వడంతో ప్రధాన పార్టీలు అత్యధిక ఓటింగ్‌ నమోదు వ ల్ల తమ పార్టీకి లభి స్తుందంటూ ఇరు పార్టీలు ఊహాగానాల్లో ఉన్నారు. 1,57,848 మంది ఓట ర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా అం దులో మహిళలు 79,330 మంది కాగా పురు షులు 78,515 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.42 శాతం నమోదై నట్టు జరిగింది. మరి ప్రధాన పార్టీల అంచ నాలు, ఊహాలు జూన్‌ 4న తెరవనున్న ఈవీ ఎంల్లో ఎవరి అంచనాలు నిజమో, ఎవరికి విజయం వరిస్తుందో వేచి చూడాలి.

Updated Date - May 15 , 2024 | 11:55 PM