Share News

రానున్నది టీడీపీ ప్రభుత్వమే

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:29 PM

రానున్నది టీడీపీ ప్రభుత్వమని ఎంపీ కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాల యంలో మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన 60 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

రానున్నది టీడీపీ ప్రభుత్వమే
పలాస: లోహరిబంద వైసీపీ కార్యకర్తలకు కండువాలు వేసి ఆహ్వానిస్తున్న ఎంపీ రామ్మోహన్‌, గౌతు శిరీష

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

లోహరిబంద గ్రామానికి చెందిన 60 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పలాస, మార్చి 27: రానున్నది టీడీపీ ప్రభుత్వమని ఎంపీ కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాల యంలో మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన 60 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దీనికి విసుగుచెంది అనేక మంది టీడీపీలో చేరడం పార్టీకి శుభ సూచకమన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలను, టీడీపీ నేతలను హింసించడం తప్ప అభివృద్ధి చేతకాలేదని రుజువైందన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీ పీ విజయం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభంజనం సృష్టించ బోతోందని, తప్పులు చేసిన వైసీపీ నాయకులకు ప్రజలు తగు రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థి గౌతు శిరీష మాట్లాడుతూ.. తనకు టికెట్‌ ప్రకటించగానే సగం విజయం సాధించామని, ప్రజాదరణతో అధిక మెజార్టీ సాధిస్తామన్నారు. కార్యక్ర మంలో మందస పార్టీ నాయ కులు భావన దుర్యోధన, దాసరి తాతా రావు, బమ్మిడి కర్రయ్య, జీకే నాయుడు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, అంబటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

గరుడుభద్ర నుంచి 20 కుటుంబాలు..

వజ్రపుకొత్తూరు: టీడీపీ అధినేత నారా చంద్రబాబుతోనే రాష్ట్రా భివృద్ధి సాధ్యమని ఆ పార్టీ పలాస అభ్యర్థి గౌతు శిరీష అన్నారు. గరుడు భద్ర పంచాయతీ నుంచి 20 కుటుంబాలు వైసీపీని వీడి బుధవారం టీడీపీలో చేరాయి. వారికి శిరీష పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో యువతకు ఉపా ధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపో తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజ యం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సూరాడ మోహన రావు, అర్సవెళ్లి ఉమామహేశ్వరరావు, బుల్లోజు శశిభూషణ్‌, కణితి సురేష్‌, పి.సాంబమూర్తి, కె.గణపతి, ఎంపీటీసీ చిట్టిబాబు, రెల్ల దానయ్య తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:29 PM