Share News

పన్నుల వసూళ్లు నగదు రహితం

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:28 PM

పంచాయతీల్లో పన్నులు నగదు రహితంగా వసూలుకు కార్యదర్శులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

పన్నుల వసూళ్లు నగదు రహితం
మామిడిపల్లి పంచాయతీ

సాలూరు రూరల్‌, జనవరి 18: పంచాయతీల్లో పన్నులు నగదు రహితంగా వసూలుకు కార్యదర్శులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇంటిపన్ను, సర్‌చార్జీలు, రోజువారీ మార్కెట్‌ వసూలు తదితరాలు తప్పనిసరిగా పంచాయతీకి ఆన్‌లైన్‌, ఫోన్‌ పే, పేటీఎం, క్యూ ఆర్‌ కోడ్‌, ఈ పోస్‌ ద్వారా చెల్లించాల్సి ఉంది. నగదు రహిత వసూలు విధానం గతేడాది ఆగస్టులోనే నిర్ణయించారు. సాంకే తిక సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. జిల్లాలో అన్ని పంచాయతీలకు క్యూ ఆర్‌ కోడ్‌లు, ఈ పోస్‌ యంత్రాలు అందించారు. మూడు వేల మంది కన్నా తక్కువ ఉన్న జనాభా గ్రామాల్లో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా, 3 వేలు దాటితే ఈ పోస్‌ యం త్రాల ద్వారా చెల్లించవచ్చు. జిల్లాలో 451 పంచా యతీల్లో దాదాపు రూ.4.95 కోట్ల పన్నులు వసూలు చేయాలని ఈ ఏడాది మార్చి 31 నాటికి లక్ష్యంగా ఉంది. ఇప్పటికే రూ. 1.20 కోట్లు వసూలు చేశారు. మరో రూ.3.75 కోట్లు గడువులోపు నగదు రహితంగా వసూలు చేయడానికి కార్యదర్శులు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఆదేశాలిచ్చామని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 11:28 PM