Share News

తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:13 AM

తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోండి

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌: తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జేసీ ఎం.నవీన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రానున్న రెండు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద ని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నిశాకుమారి, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, డీపీవో వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:13 AM