Share News

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:39 PM

లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి ఇన్‌చార్జి జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బీఎంఆర్‌ ప్రసన్నలత అన్నారు. బుధవారం కోర్టులో న్యాయవాదులు, బ్యాంకు సిబ్బంది, పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ప్రసన్నలత

టెక్కలి: లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి ఇన్‌చార్జి జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బీఎంఆర్‌ ప్రసన్నలత అన్నారు. బుధవారం కోర్టులో న్యాయవాదులు, బ్యాంకు సిబ్బంది, పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీకి అనుకూలమైన అన్ని క్రిమి నల్‌, సివిల్‌, ప్రీలిటిగేషన్‌ కేసులను ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చ న్నారు. లోక్‌అదాలత్‌ తీర్పు అంతిమమని, ఈ అదా లత్‌లో సివిల్‌ కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజులు వాపసు ఇవ్వడం జరుగు తుందన్నారు. మార్చి 9న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమా వేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దివ్వల వివేకానంద, ఏజీపీ కృష్ణారావు, ఏపీపీ హరి ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:39 PM