Share News

జూట్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:02 AM

నీలం జూట్‌ మిల్లు యాజమా న్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, పట్టణ కన్వీ నర్‌ ఆర్‌.ప్రకాశరావు డి మాండ్‌ చేశారు. ఈ మేర కు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

జూట్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న జూట్‌ మిల్‌ కార్మికులు

కలెక్టరేట్‌: నీలం జూట్‌ మిల్లు యాజమా న్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, పట్టణ కన్వీ నర్‌ ఆర్‌.ప్రకాశరావు డి మాండ్‌ చేశారు. ఈ మేర కు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు ఎటువంటి సమాచారం లేకుండా వారి హక్కులను కాలరాసి, అకస్మాత్తుగా లాకౌట్‌ ప్రకటించడం అన్యాయమని, వెంటనే లాకౌట్‌ను ఎత్తివేయాలన్నారు. పరిశ్రమను మూసివేస్తే గత 38 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులు ఏమైపో వాలని ప్రశ్నించారు. కార్మికుల శ్రమతో లాభాలు ఆర్జించిన యాజమాన్యం నేడు ఇలా ప్రవర్తించడం అమానుష మన్నారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని పరిశ్రమను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో నీలం జూట్‌మిల్‌ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగే శ్వరరావు, నక్క సూరిబాబు, కోశాధికారి ఆర్‌.అప్పన్న, నాయకులు ఎస్‌.శిమ్మయ్య, కె.ముఖ లింగం, పి.వాసు, ఆర్‌.అప్పన్న, కె.నగేష్‌, ఎన్‌.ముత్యాలమ్మ, ఎంరాజేశ్వరి, బి.ఈశ్వరమ్మ, కె.లలిత కుమారి, పి.లక్ష్మి, ఎం.ధనలక్ష్మి, ఎన్‌.యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:02 AM