Share News

మద్యం, ఇసుకతో రూ.లక్షల కోట్లు స్వాహా

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:46 PM

రాష్ట్రంలో సైకో సీఎం జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో తన అనుచర వర్గంతో మద్యం, ఇసుక దందా చేపట్టి ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని స్వాహా చేయించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు.

మద్యం, ఇసుకతో రూ.లక్షల కోట్లు స్వాహా
పొందూరు: కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తున్న రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌

ఆమదాలవలస: రాష్ట్రంలో సైకో సీఎం జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో తన అనుచర వర్గంతో మద్యం, ఇసుక దందా చేపట్టి ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని స్వాహా చేయించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీడీపీ మహాశక్తి మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రవికుమార్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అఖండ విజయం టీడీపీకి తెచ్చిపెట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు తమ్మినేని గీత, బోయిన సునీత, కణితి విజయలక్ష్మీభాయ్‌, కూన వెంకట రాజ్యలక్ష్మి, అమ్మాజీ, కూటమి నాయకులు పేడాడ సూరప్పలనాయుడు, పేడాడ రామ్మోహన్‌, నూకరాజు, సనపల ఢిల్లీశ్వరరావు, అన్నెపు భాస్కరరావు, తమ్మినేని చంద్రశేఖర్‌, విద్యాసాగర్‌, సంపతిరావు మురళీధరరావు పాల్గొన్నారు.

ఎన్నికల్లో మహిళల పాత్ర కీలకం

పొందూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళల పాత్ర అత్యంత కీలక మైనదని టీడీపీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. మండల కేంద్రం లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు అనకాపల్లి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ మహిళా నాయకులతో ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం, వ్యూహాలపై సమా వేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలపై ప్రతీ మహిళకు వివరించాల్సిన బాధ్యత మహిళా నేతలపై ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నియో జకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌ మండల టీడీపీ అధ్యక్షులు సీహెచ్‌ రామ్మోహన్‌, ఎంపీటీసీలు బాడాన హారిక, అనకాపల్లి వాణి, టీడీపీ నాయకులు అన్నెపు రాము, బి.శంకరభాస్కర్‌, బి.గిరి, ఎ.చినరంగ, సీతారామారావు, డి.గణపతి, బి.సత్యం, ఎంఎస్‌ఎన్‌ తదితరలు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

పొందూరు: మండల కేంద్రంలో వైసీపీ నుంచి 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎ.చినరంగ ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి సత్యం, అనకాపల్లి వెంకటరావు, అనకాపల్లి సంచెయ్య, చెల్లూరి పైడినాయుడు తదితరులతో పాటు 20 కుటుంబాలు చేరాయి.

అరాచక పాలనకు అంతం తప్పదు

- కూటమి అభ్యర్థి గొండు శంకర్‌

అరసవల్లి: రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న జగన్‌రెడ్డి అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. బుధవారం స్థానిక 21వ డివిజన్‌ ఇన్‌చార్జి అంబటి లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో కంపోస్టు కాలనీలో ప్రజాగళం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత చిన్నమ్మతల్లి అమ్మవారిని దర్శించు కుని, అనంతరం కాలనీలో ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను, వైసీపీ అరాచకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. ఓటమి భయంతో వైసీపీ నాయకులు ప్రతీ అంశానికి రాజకీయ కోణాన్ని ముడిపెడుతూ అబద్ధాలు చెబుతున్నారని, ఇలా ప్రజలను మోసం చేసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు నక్క శంకరరావు, వెలమల శ్రీనివాసరావు, కరకవలస శరత్‌ బాబు, టీడీపీ నాయకులు కంచు దశరథ, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్‌, మైలపల్లి నరసింహ మూర్తి, రెడ్డి గిరిజా శంకర్‌, జనసేన పార్టీ ఇన్‌చార్జి కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు జి.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకార గ్రామాల్లో పర్యటన

గార: మండలంలో పలు మత్స్యకార గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ బుధవారం సాయంత్రం పర్యటించారు. మొగదాలపాడు పేర్లవానిపేట, కొమరవానిపేట తదితర గ్రామాల్లో పర్యటించి స్థానిక పెద్దలు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యలపై ముఖ్యంగా మత్స్యకా రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం శాలిహుండం కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆ ప్రాంత ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలతో అభిమానులతో కలిసి శంకర్‌ మాట్లాడారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు పీసా వెంకట రమణమూర్తి, బడగల వెంకట అప్పా రావు, గుండ భాస్కరరావు, గొండు వెంకట రమణమూర్తి కె.ఆదినారాయణ, కె.రమణ మహర్షి, శిమ్మ శ్రీనివాస్‌ కె.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

మూడు పార్టీల శ్రేణులతో సమన్వయం

రణస్థలం: టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నట్టు విజయనగరం పార్లమెంట్‌ స్థానం టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. బుధవారం ఇద్దరు నేతలు సంయుక్తంగా ఎన్‌ఈఆర్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మూడు పార్టీల శ్రేణులు ఏకతాటిపైకి రావడం శుభ పరిణా మమన్నారు. పొత్తులో భాగంగా పార్టీ హైకమాండ్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించారని చెప్పారు. సీనియర్‌ నాయకుడు కళా వెంకటరావు ఆశీస్సులు తమకు ఉన్నాయని చెప్పారు. మూడు పార్టీల మధ్య సమన్వయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు తేలిపోయయాన్నారు. సమావేశంలో మూడు పార్టీల నాయకులు ముప్పుడి సరేష్‌, లంక శ్యామలరావు, పిషిని జగన్నాథంనాయుడు, బెండు మల్లేశ్‌, రవి, డీజీఎం ఆనందరావు, పిన్నింటి బాను, బసవ గోవిందరెడ్డి, గొర్లె లక్ష్మణరావు, రౌతు శ్రీనివాసరావు, పిన్నింటి మధు, ఇజ్జాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:46 PM