Share News

సురంగిరాజా మైదానంలో ఆక్రమణలు

ABN , Publish Date - May 21 , 2024 | 11:46 PM

ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలకు చెందిన సురంగిరాజా మైదానంలో ఆక్రమణలను అడ్డుకోవాలని సీనియర్‌ క్రీడాకారులు, రిటైర్డ్‌ ఉద్యోగులు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, ఆర్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ను కోరారు. ఈమేరకు మంగళవారం వారికి వినతిపత్రాలను అందజేశారు.

సురంగిరాజా మైదానంలో ఆక్రమణలు
ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న క్రీడాకారులు

- ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని ఇంటి నిర్మాణం

- అడ్డుకోవాలని కమిషనర్‌, ఆర్‌ఐకి వినతి

ఇచ్ఛాపురం, మే 21: ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలకు చెందిన సురంగిరాజా మైదానంలో ఆక్రమణలను అడ్డుకోవాలని సీనియర్‌ క్రీడాకారులు, రిటైర్డ్‌ ఉద్యోగులు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, ఆర్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ను కోరారు. ఈమేరకు మంగళవారం వారికి వినతిపత్రాలను అందజేశారు. పూర్వం సురంగి రాజావారు విద్యార్థుల ఆట స్థలం కోసం సుమారు 5 ఎకరాలు హైస్కూల్‌కు విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ మైదానంలో ఆడుకుంటున్నారు. ఇక్కడ క్రీడలు ప్రాక్టీస్‌ చేసిన విద్యార్థులు జాతీయస్థాయిలో కూడా రాణించి బంగారు పతకాలు కూడా సాధించారు. ఎంతోమందికి ఉపయోగపడే ఈ మైదానాన్ని.. ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని ఆక్రమణకు పాల్పడింది. తప్పుడు పత్రాలు సృష్టించి.. ఆక్రమించిన స్థలంలో ఇల్లు నిర్మిస్తోంది. వెంటనే ఈ అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని కమిషనర్‌, ఆర్‌ఐను క్రీడాకారులు కోరారు. కార్యక్రమంలో క్రీడాకారులు ఉప్పాడ డిల్లీ, కస్పా పాపారావు, బత్తిన బాలాజీ, శేఖర్‌, బదాని, రిటైర్డ్‌ ఉద్యోగి వాసు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:46 PM