Share News

ఓపీఎస్‌ హామీ ఇచ్చే పార్టీకే మద్దతు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:38 PM

ఓపీఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టే పార్టీకే ఉద్యోగ, ఉపాధ్యాయులు మద్దతు ఇస్తారని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు అన్నారు. సోమవారం నంది గాం ఎమ్మార్సీ, కాపు తెంబూ రు ఉన్నతపాఠశాలల ఆవరణలో ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ పుస్తకావిష్కరణ చేశా రు.

ఓపీఎస్‌ హామీ ఇచ్చే పార్టీకే మద్దతు

నందిగాం: ఓపీఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టే పార్టీకే ఉద్యోగ, ఉపాధ్యాయులు మద్దతు ఇస్తారని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు అన్నారు. సోమవారం నంది గాం ఎమ్మార్సీ, కాపు తెంబూ రు ఉన్నతపాఠశాలల ఆవరణలో ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ పుస్తకావిష్కరణ చేశా రు. మండల కాంప్లెక్స్‌ పరిధిలోని గోడలపై ‘రానున్న ఎన్నికల్లో పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించే పార్టీ లకే మద్దతు’ అంటూ గోడలపై బోర్డులు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎంఈవో జె.చిన్నారావు, హెచ్‌ఎం టి.అప్పల స్వామి, యూటీఎఫ్‌ సంఘ ప్రతినిధులు కె.కుమారస్వామి, వై.గణపతి, కె.సురేష్‌కుమార్‌, ఎన్‌.శివప్రసాద్‌ తదితరులున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:38 PM