ఎరువులు సరఫరా చేయండి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:26 PM
:ప్రతి రైతుకు ఖరీఫ్‌లో ఎరువులు సకా లంలో సరఫరా చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవసాయాధికారులను ఆదేశించా రు.

సరుబుజ్జిలి:ప్రతి రైతుకు ఖరీఫ్‌లో ఎరువులు సకా లంలో సరఫరా చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవసాయాధికారులను ఆదేశించా రు. ఆదివారం మండలంలోని చిన్నపాలెంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన రవికుమార్‌ను టీడీపీ నాయకులు గజ్జన చంటి, నాగం రమేష్ ఆధ్వ ర్యంలో గ్రామస్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన రైతులు ఇంకా ఎరువులు సరఫరా చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏవో బి.పద్మనాభంతో రవికుమార్ ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివ్వా ల సూర్యనారాయణ, ఎ.రాంబాబు, ఎన్.గోవిం దరావు, పి.సురేష్, కె.సిద్దార్థ, ఎల్.పూర్ణారావు, టీవీ రమణ, టి.రాజారావు పాల్గొన్నారు.