Share News

రెండో రోజూ సక్సెస్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:15 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన శంఖారావం రెండో రోజూ జిల్లాలో విజయవంతమైంది. సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో చేపట్టిన శంఖారావం సభల్లో పార్టీ కేడర్‌ ఉత్సాహంగా పాల్గొంది. దీంతో నేతల్లోనూ జోష్‌ నింపింది. ఈ మూడు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, జనసేన నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

రెండో రోజూ సక్సెస్‌
శ్రీకాకుళంలో పార్టీ కేడర్‌కు అభివాదం చేస్తున్న నారా లోకేశ్‌

శంఖారావంలో ఉత్సాహంగా పాల్గొన్న కేడర్‌

సమస్యలపై వినతులు స్వీకరించిన లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన శంఖారావం రెండో రోజూ జిల్లాలో విజయవంతమైంది. సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో చేపట్టిన శంఖారావం సభల్లో పార్టీ కేడర్‌ ఉత్సాహంగా పాల్గొంది. దీంతో నేతల్లోనూ జోష్‌ నింపింది. ఈ మూడు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, జనసేన నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శంఖారావం యాత్ర ఉత్సాహంగా సాగడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శంఖారావంలో నేతల ప్రసంగాలు ఇలా...

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంకండి

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

ఆమదాలవలస: రానున్న ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతం లో కలిపేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నా యుడు అన్నారు. ఆమదాలవలసలో కూన రవికుమార్‌ పులిలా పోరాడుతున్నారని, నియోజకవర్గంలో పసుపు తప్ప మరో జెం డా కనబడే పరిస్థితి లేదన్నారు. తమ్మినేని సీతారాంను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. ఎన్నో రకాల ఇబ్బందులుపడుతూ శంఖారావంతో లోకేశ్‌ మన ముందుకు వచ్చారన్నారు. రవికుమార్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్‌కాంప్లెక్స్‌, టిడ్కో ఇళ్లు, రహదారులు అభివృద్ధి జరిగాయన్నారు. ఆమదాలవలసకు ప్రస్తుతం సీతారాంతో పాటు ముగ్గురు సూపర్‌ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, ముగ్గురు హుండీలను ఏర్పాటు చేసుకొని కలె క్షన్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలల్లో వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ పవర్‌ ఆమ దాలవలస ప్రజలు చూపాలని కోరారు. అధికారంలోకి వచ్చాక ఆమదాలవలస రైల్వే స్టేషన్‌ను ప్రధాన స్టేషన్‌గా తీద్చిదిద్దుతామన్నారు. వంశధార ప్రాజెక్టుకు బొడ్డేపల్లి రాజగోపాలరావు పేరు పెట్టాలని పార్లమెంట్‌లో గళమెత్తానన్నారు. ఆమదాలవలస సుగర్‌ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న వారు కనిపించకుండాపోయారన్నారు.

టీడీపీ పాలన స్వర్ణయుగం

నరసన్నపేట: టీడీపీ పాలన కాలంలో నరసన్నపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మని, నాడు స్వర్ణయుగంలా ఉండేదని, అయితే ప్రస్తుత వైసీపీ నేతలు నిర్లక్ష్యం చేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్ధిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. భూసర్వేలో కొలతరాళ్లపై, రైతుల పాస్‌పుస్తకాలపై బొమ్మ వేసుకున్న సీఎం జగన్‌ను మరలా గెలిపిస్తే మీ ఆస్తులు కూడా నావేనని అందుకు నాబొమ్మ ఉందని లాక్కోవడం ఖాయమన్నారు.

తమ్మినేనికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా

టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌

ఆమదాలవలస: స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు రానున్న ఎన్నికల్లో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా.. కాస్కోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సవాల్‌ విసిరారు. పడిలేచిన కెరటం, ఉప్పెనలా విజృంభిస్తున్న యువనేత లోకేశ్‌ శంఖారావంతో జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు దిగమింగి 16 నెలలు చిప్ప కూడు తిన్న సైకోతో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నామన్నారు. ఒక్కచాన్స్‌ టైమ్‌ అయిపోయిందని తెలిపారు. 2014-19లో 50 ఏళ్లలో ఒకనేత చేయలేని పనులను చంద్రబాబు నేతృత్వంలో తాను చేసి చూపిం చానన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించానని, రోడ్డులేని గ్రామాలకు రహదారి వేశా మని చెప్పారు. ఇంకా మిగిలిపోయిన 34 గ్రామాలకు లోకేశ్‌ మంత్రిగా ఉన్నప్పుడు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ఆమదాలవలసలో తాగడానికి నీళ్లు లేని పరిస్థి తుల్లో 22 వార్డులకు నీరిచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. మునిసిపాలిటీలో తాగునీటికి నాడు రూ.65 కోట్లు మంజూరు చేయిస్తే పూర్తి చేయలేని చేతగాని వ్యక్తి సీతారాం అన్నారు. టీడీపీ హయాంలో 3,250 ఇళ్లు మంజూరు చేయించామని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. లోకేశ్‌ పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు నాగావళి, వంశధార నదుల నుంచి నీరందించాలని రూ.276 కోట్లు మంజూరు చేస్తే చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే వాటిని రద్దుచేసి కమీషన్ల కోసం ఇప్పుడు పైపులైన్లు అంటున్నారని విమర్శించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిఇంటికి నాగావళి, వంశధార నీరందిస్తామన్నారు. నీతిగా పనిచేసినందుకు తనపై కేసులు పెట్టారని, ఈరోజు తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధాంతం మార్చుకోనన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన పోలీసులను చట్టం ప్రకారం శిక్షిస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి ఆమదాల వలసకు పది కిలోమీటర్లు రోడ్డు వేయలేని అసమర్థుడు సీతారాం అభివృద్ధి చేశానంటు న్నాడని రవికుమార్‌ ఎద్దేవా చేశారు. అబద్దాల కోరు జగన్‌ ఆమదాలవలస సుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పాడన్నారు.

అప్పుల ఊబిలోకి నెట్టేశారు

శీకాకుళం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి

అరసవల్లి/క్రైమ్‌: నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న సీఎం జగన్‌రెడ్డి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి ఆరోపించారు. మళ్లీ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. శ్రీకాకుళంలో శంఖారావం సభలో మాట్లాడుతూ.. టీడీపీ క్రమశిక్షణకు మారుపేర న్నారు. టీడీపీ హయాంలో ఎవరిపై దాడులు, లేదా ఆస్తుల విధ్వంసం చేసిన చరిత్ర లేదని చెప్పా రు. ప్రజాస్వామ్య పాలనకు కట్టుబడి పరిపాలన సాగించిన పార్టీ టీడీపీ అన్నారు. లోకేశ్‌ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి తాగునీటి ప్రాజెక్టు మంజూరు చేశారని, కళింగపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించి 80 శాతం పనులు కూడా పూర్తి చేశామని, కానీ 56 నెలల వైసీపీ పాలనలో మిగతా 20 శాతం పనులను కూడా పూర్తి చేయలేదన్నారు. ఒక్కచాన్స్‌ అని అడిగిన జగన్‌రెడ్డికి ఓటేసిన పాపానికి రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. మళ్లీ ఓటేస్తే మన పొలాలు, ఆస్తులను కూడా లాక్కో వడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రజలు గెలిపించడం ద్వారా మాత్రమే మనం రాష్ట్రాన్ని కాపాడుకోగలమని, ప్రజలంతా తమ వంతు బాధ్యతగా టీడీపీని గెలిపించాలని కోరారు.

దోపిడీలో కృష్ణదాస్‌ కుటుంబం

మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట: వైసీపీ పాలనలో ఇక్కడి ఎమ్మెల్యే కృష్ణదాస్‌ కుటుంబం దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నియోజవర్గంలో ఇసుక దోపిడీకి పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను అమ్మకోవడమే కాకుండా.. అధి కారుల బదిలీలకు కూడా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంజూరై పూర్తయిన పనులకు రంగులు వేసి ప్రారంభించిన ఘనత వైసీపీ నాయకులకే చెందుతుందన్నారు. బొంతు ఎత్తపోతల పథకం 62 శాతం, శ్రీముఖలింగం తాగునీటి పథకం 70 శాతం పూర్తి చేస్తే నేటికి కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఉందన్నారు. ఎర్రన్నాయుడు చిల్డ్రన్‌ పార్కును కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు.

Updated Date - Feb 13 , 2024 | 12:15 AM