Share News

విద్యార్థుల భద్రత మనందరి బాధ్యత

ABN , Publish Date - Apr 01 , 2024 | 11:58 PM

విద్యార్థులకు విద్యా భ్యాసం చేయడంతో పాటు వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి, వారి భద్రతను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల తో పాటు కళాశాల యాజమాన్యంపై ఉందని ఎస్పీ జీఆర్‌ రాధిక సూచించారు.

విద్యార్థుల భద్రత మనందరి బాధ్యత

శ్రీకాకుళం క్రైం: విద్యార్థులకు విద్యా భ్యాసం చేయడంతో పాటు వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి, వారి భద్రతను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల తో పాటు కళాశాల యాజమాన్యంపై ఉందని ఎస్పీ జీఆర్‌ రాధిక సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం వివిధ కళాశాలల యాజమాన్యాలతో ‘విద్యార్థుల భద్రత-ఆత్మహత్యల నివారణ’పై ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాల, వసతి గృహాలకు వచ్చిన విద్యార్థుల ప్రవర్తనను ప్రతీ క్షణం పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పరిశీలించి చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐవో పి.దుర్గారావు, ఏఎస్పీ జి.ప్రేమ్‌ కాజల్‌, డీఎస్పీ ఎ.విజయకుమార్‌, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2024 | 11:58 PM