Share News

ఆదివాసీల హక్కులకై పోరాటం

ABN , Publish Date - May 24 , 2024 | 11:26 PM

ఆదివాసీల హక్కులకై పోరాటం చేద్దామని సీపీఐఎం ఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. శుక్రవారం మొఖలింగాపురంలో పర్యటించి ఆదివాసీలతో మాట్లా డారు.

ఆదివాసీల హక్కులకై పోరాటం
నినాదాలు చేస్తున్న దృశ్యం

టెక్కలి: ఆదివాసీల హక్కులకై పోరాటం చేద్దామని సీపీఐఎం ఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. శుక్రవారం మొఖలింగాపురంలో పర్యటించి ఆదివాసీలతో మాట్లా డారు. జిల్లా విభజన తరువాత ఐటీడీఏ లేకపోవడంతో ఆదివాసీల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ల క్ష్యం వహిస్తోందన్నారు. జిల్లాలో ఉన్న ఆదివాసీ గ్రామాలన్నింటినీ ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని, 1/70 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోడుభూములకు పట్టాలివ్వలేదన్నారు. టెక్కలి, మెళియాపుట్టి మండ లాల్లోని గిరిజన గ్రామాలకు రోడ్లు లేవని, వైద్య సౌకర్యాలు కానరావడం లేదన్నారు. కార్యక్రమంలో జుత్తు వీరాస్వామి, సోమేశ్వరరావు, సుహాసిని, ఈశ్వరరావు, శ్రీనివాస్‌, దమయంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:26 PM