Share News

సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:24 PM

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మి కుల సమ్మె సమ యంలో అంగీక రించిన ఒప్పం దం మేరకు చేసిన జీవోలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామ ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, ఉపాధ్యక్షుడు అరుగుల గణేష్‌ డిమాండ్‌ చేశారు.

సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలి

అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మి కుల సమ్మె సమ యంలో అంగీక రించిన ఒప్పం దం మేరకు చేసిన జీవోలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామ ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, ఉపాధ్యక్షుడు అరుగుల గణేష్‌ డిమాండ్‌ చేశారు. 16 రోజుల సమ్మె కాలపు ఒప్పందాల జీవోలను జారీ చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ను వెల్లడించాలని, క్లాప్‌ డ్రైవర్ల సమస్యలపై జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి చట్ట బద్ధమైన జీతభత్యాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం స్థానిక నగరపాలక సం స్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాలయాపన చేయకుండా జీవోలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్‌.ప్రకా ష్‌, పలాస నాయకులు సీహెచ్‌ మురుగన్‌, పి.బాలకృష్ణ, కె.వెంకటి, శ్రీకాకుళం నాయ కులు ఎ.శంకర్‌, అర్జి శేఖర్‌, మోహన్‌, గురుస్వామి, ఎస్‌.వెంకటరమణ, ఎ.జనార్దన్‌, ఎన్‌.పార్వతి, ఆర్‌.ఈశ్వరమ్మ, డి.గణేష్‌, డి.చిట్టిబాబు, ఎ.రాజేష్‌, కె.ఆరుద్రమ్మ, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:24 PM