Share News

అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: ఎంపీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:09 AM

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు, నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ పిలుపు నిచ్చారు.

అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: ఎంపీ
బూర్జ: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రామ్మోహన్‌, రవికుమార్‌

- ఎంపీ రామ్మోహన్‌నాయుడు

బూర్జ: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు, నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ పిలుపు నిచ్చారు. ఈ మేరకు గురువారం పెద్దపేట పంచాయతీలోని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బొమ్మిక, గిరడపేట, మదనాపురం గ్రామాల్లో పర్యటించి టీడీపీ అందించనున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పేడాడ రామ్మోహన్‌, పేడాడ సూరనాయడు, ఆనెపు రామకృష్ణ, మొదలవలస రమేష్‌, వావిలపల్లి సీతారాం, రామ్‌జీ, సత్యప్రసా ద్‌, కృష్ణగోపి, విక్రమ్‌, నాగేంద్ర, జయరామ్‌, పిల్ల జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

కూటమి విజయం తథ్యం

- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాస: ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజ యం తథ్యమని తెలిపారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఆమె గురువారం విలేక రులతో మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం అఽథమస్థాయికి చేరుకుం దన్నారు. ఒకటో తేదీ నాడు ఎవరికీ జీతాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. దివాళా తీసిన రాష్ట్రానికి జవసత్వాలు అందించాలనే లక్ష్యంతో మూడుపార్టీలు జతకట్టి ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ కూటమి అధికారంలోకి రాగానే సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యో గాల కల్పన, ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, దీపం పథకం కింద మహిళలకు మూడుగ్యాస్‌ కనెక్షన్లు, 18-59 ఏళ్ల మధ్య మహిళలకు ఆడబిడ్డనిధి కింద రూ.1500, బీసీ వర్గాలకు 50 ఏళ్లకు పింఛన్లు కల్పించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

టీడీపీలో 60 కుటుంబాల చేరిక

పొందూరు: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూట మికి పూర్తి మెజార్టీ అందించి సంపూర్ణ విజయం అందించడానికి రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో గాంధీనగర్‌వీధి సమీపాన గల దళితవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. దళితవాడకు చెందిన కె.రా జేష్‌ ఆధ్వర్యంలో 60 కుటుంబాలు టీడీపీ చేరాయి. వీరికి కుండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. కా ర్యక్రమంలో పార్టీ మంండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మో హన్‌, నాయకులు అన్నెపు రాము, సీపాన శ్రీరంగనా యకులు, బలగ శంకరభాస్కర్‌, అనకాపల్లి చినరంగ, బాడాన గిరి, ఎంపీటీసీ ఎ.వాణి, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

అరసవల్లి: వైసీపీ నిరంకుశ పాలనలో అన్ని వ్యవస్థలను ని ర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధో గతి పాలు చేశా రని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. గురువారం నగరంలోని కృష్ణాపార్కు జంక్షన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరు, సాగునీరు, మురుగు నీరు సమస్య తీవ్రంగా వేఽధిస్తోందని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన పరిస్థితిలో ఉందన్నారు. నగరంలో ఇరుకైన రోడ్ల వల్ల ట్రా ఫిక్‌ సమస్య ఎక్కువైందని వీటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. నగరం లోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని పూర్తి శిథాలావస్థకు చేర్చిన ఘనత వైసీపీదేన న్నారు. బీసీల అభ్యున్నతి కోసమే బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు ప్రకటించార న్నారు. టీడీపీ, బీజేపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు

అరసవల్లి: టీడీసీ మేనిఫెస్టోతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. గురు వారం సాయంత్రం నగరంలోని బలగలో ఆయా వార్డు టీడీపీ ఇన్‌చార్జీలు, నాయ కులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జీలు రెడ్డి సూర్యనారాయణ, కేవీఎస్‌ బుజ్జి, రెడ్డి గిరిజా శంకర్‌, దొండపాటి నవీన్‌కుమార్‌, కోరాడ హరగోపాల్‌, తంగి నర్సింగరావు, జనసేన నాయకుటు చిట్టి భాస్కరరావు, బీజేపీ నాయకుడు రావాడ పురుషోత్తం, సాధు కోటేశ్వరరావు, పరమేశ్వరరావు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ఇచ్ఛాపురం: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర రెడ్డిక బీసీ సాధికార సమితి కన్వీనర్‌ కొండా శంకర్‌రెడ్డి అన్నా రు. గురువారం నీలాపుపుట్టుగ, సన్యాసిపుట్టుగ, కేసుపురం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చంద్ర బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రెడ్డిక కులస్థులకు న్యాయం జరుతుం దన్నా రు. జయహో బీసీ సభలో చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలు ఇచ్ఛాపురం ని యోజకవర్గంలో ప్రత్యేకంగా రెడ్డిక కులస్థులకు ఎంతగానో ప్రయోజనం కల్పిస్తాయ న్నారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ అధికారంలో వస్తే అమలు చేయనున్న పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మణిచంద్రరెడ్డి, దక్కత ఢిల్లీరావు, ఆశి జీవులురెడ్డి, లీలారాణి, సహదేవ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఎల్‌ తారకేష్‌రెడ్డి, గిన్ని చిన్నా పాల్గొన్నారు.

సన్యాసిపుట్టుగలో సూపర్‌ సిక్స్‌..

ఇచ్ఛాపురం: తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమ పధకాలు సాద్యమని మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు అన్నారు. గురువారం సన్యాసిపుట్టుగ గ్రామంలో సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అందించనున్న పథ కాలపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యేగా మళ్లీ బెందాళం అశోక్‌ను గెలిపం చుకొనే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:09 AM