ఇంకా జగన్ ఫొటోనే!
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:02 AM
అధికారులు ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ జపంలో నుంచి బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. ఇందుకు ఈ ఫొటోయే నిదర్శనం.

- మాజీ సీఎం జపంలోనే అధికారులు
జి.సిగడాం: అధికారులు ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ జపంలో నుంచి బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. ఇందుకు ఈ ఫొటోయే నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే చాలా వాహనాలపై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మలు దర్శి నమిస్తున్నా అధికారులకు పట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం నడిమివలస గ్రామంలో జగన్ ఫొటో ఉన్న వాహనంతో రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా దీనిపై సీఎస్‌డీటీ ఆర్.వెంకటేష్‌ను వివర ణ కోరగా.. రేషన్ పంపిణీ వాహనాలపై ఉన్న మాజీ సీఎం జగన్ ఫొటోలను కప్పేయాలని ఎండీయూ ఆపరేటర్లను గతంలోనే ఆదేశించినట్టు తెలిపారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.