Share News

వైసీపీతో రాష్ట్రం విచ్ఛిన్నం: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:25 AM

గడచిన ఐదేళ్లలో రాష్ట్రా న్ని వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు విమర్శించారు. బుధవారం సాయం త్రం పాలతలగాం, శ్రీకృష్ణాపురం, ఉద్దండ పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వైసీపీతో రాష్ట్రం విచ్ఛిన్నం: అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి: శ్రీకృష్ణాపురంలో ముస్లిం మహిళలతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి: గడచిన ఐదేళ్లలో రాష్ట్రా న్ని వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు విమర్శించారు. బుధవారం సాయం త్రం పాలతలగాం, శ్రీకృష్ణాపురం, ఉద్దండ పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క చాన్సంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ మరో సారి మాయ మాటలు చెబుతున్నాడని, వీటిని నమ్మవద్దన్నారు. చంద్రబాబు నాయ కత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, రానున్న ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. శ్రీకృష్ణాపురా నికి చెందిన బాడాన మోహనరావు, వాన రామ్మూర్తి టీడీపీలో చేరగా వారికి అచ్చెన్నాయుడు కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాడాన వెంకటరమణమ్మ, టీడీపీ మండల కార్యదర్శి రెడ్డి అప్పన్న, కొర్రాయి రమేష్‌, కొర్రాయి అప్పన్న పాల్గొన్నారు.

జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: శిరీష

వజ్రపుకొత్తూరు: రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కూటమి అభ్యర్థి గౌతు శిరీష అన్నా రు. గరుడభద్ర గ్రామంలో బుధవారం ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు వివరించారు. బడు గుల అభ్యున్నతికి, ,రైతులకు ఆదుకునేందుకు నిరం తరం కృషి చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మె ల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌నాయుడును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, కోనారి గణపతి, శశిభూషణ్‌ పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

జి.సిగడాం: పాలఖండ్యాం వైసీపీ మాజీ సర్పంచ్‌ పెద్ద భాస్కరరావు టీడీపీ తీర్ధం పుచ్చు కున్నారు. ఆయనతో పా టు పలువురు నేతలు, 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరగా వారికి విజయనగరం ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు కండువాలు వేసి ఆహ్వానించారు. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని అప్పలనాయుడు కోరారు. కార్యక్ర మంలో నాయకులు బి.వెంక టేశ్వరరావు, పలిశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బండిపాలేనికి చెందిన 50 వైసీపీ కుంటుంబాలు..

రణస్థలం: రణస్థలం పంచాయతీ పరిధి బండిపాలేనికి చెందిన 50 వైసీపీ కుంటుం బాలు సర్పంచ్‌ పిన్నింటి భాను, మజ్జి వెంకటరమణ, మాజీ సర్పంచ్‌ రమణయ్య, కెల్ల హేమంతు కుమార్‌ ఆధ్వర్యంలో బుధ వారం టీడీపీలో చేరారు. వీరికి ఎన్‌డీఏ కూటమి ఎచ్చెర్ల అభ్యర్థి నడుకుదిటి ఈశ్వర రావు టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టిని గెలిపించాలని, కమలం, సైకిల్‌ గుర్తులపై ఓట్లు వేయించాలని కోరారు. యువతను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.

వైశ్య సంఘం నేతలు..

సోంపేట: పట్టణానికి చెందిన వైశ్య సం ఘం నేతలు టీడీపీలో చేరారు. బుధవారం ఎమ్మెల్యే అశోక్‌ నామినేషన్‌కు వచ్చిన ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో పట్టణానికి చెందిన మల్లా నాగేశ్వరరావు, మల్లా బాబూరావు, కొంచాడ శ్రీనివాసరావు, కొత్త కోట సంతోష్‌తోపాటు మరో 20 మంది ఉన్నారు. కార్యక్రమంలో నేతలు చిత్రాడ శ్రీనివాసరావు, బెల్లాన శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:25 AM