Share News

3న రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్‌ సదస్సు

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:57 AM

రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో జనవరి 3న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిం చనున్నట్టు శ్రీకాకుళం ఉమ్మడి జి ల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ తెలిపారు.

3న రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్‌ సదస్సు

- జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌

శ్రీకాకుళం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో జనవరి 3న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిం చనున్నట్టు శ్రీకాకుళం ఉమ్మడి జి ల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ తెలిపారు. ఈ మే రకు ఆదివారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులు, అధికారాల ను దొంగలించి 3.5కోట్ల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ సమావేశానికి జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొనాలని పి లుపునిచ్చారు. జనవరి 3న బుధవారం తాడేపల్లిలో ఏపీ పంచాయ తీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మీముత్యాలరావు అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ముఖ్యఅతిథిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించినట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని స్పష్టంచేశారు.

- గార: మంగళగిరిలో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం రెండు గం టలకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పంచాయతీ రాజ్‌ సదస్సుకు శ్రీకాకుళం నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులంతా పా ర్టీలకు అతీతంగా రావాలని నియోజకవర్గ సర్పంచ్‌లు సంఘం అధ్యక్షు డు కొంక్యాన ఆదినారాయణ, ఉపాధ్యక్షురాలు రుప్ప లక్ష్మి కోరారు. ఆదివారం సాయంత్రం గారలో మండల టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Jan 01 , 2024 | 12:57 AM