Share News

టీడీపీ-జనసేన కూటమితో రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:43 PM

టీడీపీ-జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పలువురు నేతలు అన్నారు. గ్రామాల్లో బాబు ష్యూరిటీ, సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలు అవగాహన కలిగించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.

టీడీపీ-జనసేన కూటమితో రాష్ట్రాభివృద్ధి
నరసన్నపేట: తల్లికి వందనం పథకంపై వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

టీడీపీ-జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పలువురు నేతలు అన్నారు. గ్రామాల్లో బాబు ష్యూరిటీ, సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలు అవగాహన కలిగించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.

తల్లికి వందనంతో ప్రతి విద్యార్థికీ మేలు

నరసన్నపేట: టీడీపీ-జనసేన ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికీ మేలు చేకూరుతుందని మాజీ ఎమ్మె ల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం పట్టణంలో 15వ వార్డు పరిధి చిత్రివీధి, పప్పులవీధి తదతర ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెం టీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు కరపత్రాలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో నేతలు శిమ్మ చంద్రశేఖర్‌, గొద్దు చిట్టిబాబు, నేతింటి విశ్వే శ్వరరావు, చంద్రరావు, బోయన సతీష్‌, బెవర రాము, కింజరాపు రామా రావు, కూన రమేష్‌, తాళాభక్తుల గోవిందరావు, బెవర శివ,పల్లి సీతాపతి తదితరులు పాల్గొన్నారు.

సంతబొమ్మాళి: టీడీపీ హయాంలోనే తీరప్రాంత గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ ఎంపీపీ చిదపాన ధర్మార్జునరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి అప్పన్న అన్నారు. సోమవారం మలగాం పంచాయతీ చెరువు గట్టుపేటలో ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పఽథకా లపై అవగాహన కలిగించారు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు టీడీపీ ప్రభుత్వంలోనే ఏర్పాట య్యాయన్నారు. కార్యక్రమంలో మలగాం మాజీ సర్పంచ్‌లు బుచ్చ మురళీకృష్ణ, రట్టి పెరుమాళ్ళు, ఉప సర్పంచ్‌ కంది లచ్చయ్య, వజ్జ ప్రభాకర్‌, సూరాడ ధనరాజ్‌, సువ్వారి ప్రసాద్‌, కూశెట్టి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

జలుమూరు: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. చీడిపూడి, అక్కివలస, లక్ష్మీపురం గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని బలపరచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పొదిలాపు వేణుగోపాలరావు, హనుమంతు వెంకటరమణమూర్తి, కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు.

టెక్కలి: టీడీపీతోనే గ్రా మాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మండల అధ్య క్షుడు బగాది శేషగిరి అన్నారు. సోమవారం మొఖలింగాపురం పంచాయతీ బెండకాయలపేట, మొఖ లింగాపురం గ్రామాల్లో సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కలిగించారు. వైసీపీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు జన్ని చిన్నారావు, ఆదినారాయణ, లచ్చుమయ్య తమకు పింఛన్లు ఇంతవరకు ఇవ్వలేదని వారి దృష్టికి తీసుకువెళ్లగా అధికా రుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.

జి.సిగడాం: టీడీపీ అధినేత చంద్రబాబు తోనే భవిష్యత్‌కు గ్యారెంటీ అని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు కూనుబిల్లి కూర్మారావు, టంకాల మౌళీశ్వరరావు అన్నారు. సోమవారం అబోతులపేట, నాగులవలస, పెంట, జాడ, జగన్నా ఽథవలస, దేవరవలస, మర్రివలస, సీతంపేట, నడిమి వలస, బాతువ తదితర గ్రామాల్లో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ నిర్వ హించారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టనున్న సూపర్‌ సిక్స్‌ పఽథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో చిత్తిరి అసిరినాయుడు, పైల రామ కృష్ణంనాయుడు, మహా దాశ్యం చిన్నారావు, జక్కంపూడి దాసు, గోక మహేష్‌, బాలి తమ్మినాయుడు, కూనుబిల్లి శ్రీనివాసరావు, కె.సంతోష్‌కుమార్‌, మీసాల అశోక్‌కుమార్‌, సిరిపురపు ఉపేంద్ర, నేదూరి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:43 PM