Share News

గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN , Publish Date - May 19 , 2024 | 11:52 PM

జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అమ్మవార్ల సంబరాలతో పాటు వెంకన్న స్వామి, నరసింహ స్వాముల కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్ర మాలు నిర్వహించారు.

గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
ఎల్‌ఎన్‌పేట: కలశాలతో అమ్మవారి ఆలయానికి వెళుతున్న మహిళలు

నందిగాంలో వేంకటేశ్వరుని కల్యాణం

నందిగాం: జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అమ్మవార్ల సంబరాలతో పాటు వెంకన్న స్వామి, నరసింహ స్వాముల కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్ర మాలు నిర్వహించారు. నందిగాం మండలం పెంటూరులో కొలువై ఉన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం 22వ వార్షికోత్సవం సందర్భంగా వార్షిక కల్యాణం ఆదివారం కమనీయంగా నిర్వహించారు. ధర్మకర్తలు బొడ్డ జనా ర్దనరావు, కృష్ణారావు ఆధ్వర్యంలో శ్రీకూర్మంకు చెందిన వేదపండి తులు గోపినంబాళ్ల వెంకటదాస్‌ కూర్మాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు డి.రవిరామాచార్యులు, ఇతర రుత్వికుల వేదమంత్రాల మధ్య నవకలశ స్నపనం, పంచామృతాభిషేకం, విశేష హోమాలు, పూర్ణా హుతి, కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నందిగాం, పెం టూరు తదితర గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు.

కల్యాణం.. కమనీయం

టెక్కలి: టెక్కలి కొడ్రవీధి జంక్షన్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణం ఆదివారం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అర్చకుడు సీహెచ్‌ రమణాచార్యులు కల్యా ణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో వాకచర్ల రాధాకృష్ణ, పలువురు భక్తు లు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు.

ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

పలాస: స్థానిక సీతారామాలయంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు ఆది వారం కన్నుల పండువగా నిర్వహిం చారు. తెల్లవారుజామున మేలుకొలుపుతో కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకం చేపట్టారు. అనంతరం నగర పురోహితులు నగరంపల్లి ప్రసాదరావు శర్మ ఆధ్వర్యంలో దంపతులతో సత్యవ్రతాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద విత రణ చేపట్టారు. కార్యక్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి గిన్ని జయ శంకర్‌రెడ్డి, ధర్మకర్త పెంట భాస్కరరావు, కృష్ణానందస్వామితో పాటు భక్తులు పాల్గొన్నారు.

అమ్మవార్లకు చల్లదనం

ఎల్‌.ఎన్‌.పేట: లక్ష్మీనర్సుపేటలో బంగారు సంతోషిమాత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహిళలు భారీ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. మంగళ వాయిద్యాలు, నృత్య ప్రదర్శనల మధ్య మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాలు 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ ఎం.దివాకర్‌ నాయుడు, పెద్దలు వి.పాండురంగనాథరాజు, ఎం.జనార్దనరావు, రామ్‌ నాథ్‌ మహాపాత్రో తదితరులు తెలిపారు.

లింగాలవలసలో..

జలుమూరు: లింగాలవలస గ్రామంలో పోలేరమ్మ అమ్మవారికి ఆదివారం ముర్రాటలు సమర్పించి చల్ల దనం చేశారు. ఏడాది పొడవునా చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. మహిళలు కలశాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని తరించారు. అల్లాడ గ్రామంలో నిర్వహిస్తున్న రాజరాజేశ్వరి అమ్మవారి సంబరాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సనపల రమణ, టీడీపీ నాయకులు దుద్దు రాజేశ్వరరావు, హనుమంతు రంగనాథం తదితరులు పాల్గొన్నారు.

గుల్లవానిపేటలో..

గుల్లవానిపేట(పోలాకి): సాగరతీర ప్రాంతం గుల్లవానిపేటలో రెండు రోజులుగా గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మ వారికి చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సంద ర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

జలుమూరు: సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామికి ఆదివారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు , అభిషేకాలు చేశారు. సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో వేంచేపు చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి నిర్వహించారు మహిళలు, భక్తులు మంగళ హారతులిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఈవో పి.ప్రభాకరరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:52 PM