అదృశ్యం కేసుల దర్యాప్తు వేగవంతం
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:31 PM
జిల్లాలో అదృశ్యం(మిస్సింగ్) కేసులపై ప్రత్యేక దృష్టి సారించి.. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ జీఆర్ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐలతో సమావేశమయ్యారు.

- ఎస్పీ జీఆర్ రాధిక
శ్రీకాకుళం క్రైం, జూలై 5: జిల్లాలో అదృశ్యం(మిస్సింగ్) కేసులపై ప్రత్యేక దృష్టి సారించి.. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ జీఆర్ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐలతో సమావేశమయ్యారు. జిల్లావ్యాప్తంగా అదృశ్య కేసులు దర్యాప్తు, విచారణ, కేసు ఫైల్ స్టేజ్ తదితర అంశాలపై సమీక్షించారు. ముందుగా అదృశ్య కేసుల ఫైల్స్ పరిశీలించారు. కేసుల దర్యాప్తులో పురోగతిపై ఆరా తీశారు. అదృశ్యమైన వ్యక్తులను పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని సూచించారు. సాంకేతిక ఆధారాల ద్వారా కూడా వ్యక్తుల సమాచారం తెలుసుకుని.. కేసులు పరిష్కరించాలని తెలిపారు. యుక్త వయసులో తప్పిపోయిన బాలికలు, మహిళల కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ఈ కేసులను చేధించి.. తల్ల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు బాధిత మహిళలను అప్పగించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ డా.జి.ప్రేమ్ కాజల్ పాల్గ్గొన్నారు.