Share News

ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:18 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చి వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ రెగ్యూలర్‌ సర్వీసులతోపాటు అదనంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు డీపీటీవో ఎ.విజయ్‌కుమార్‌ తెలియజేశారు.

ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు

గుజరాతీపేట: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చి వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ రెగ్యూలర్‌ సర్వీసులతోపాటు అదనంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు డీపీటీవో ఎ.విజయ్‌కుమార్‌ తెలియజేశారు. ఒకేసారి రానుపోను రిజర్వేషన్లు చేసుకుంటే మొత్తం టిక్కెట్‌ చార్జీలో పది శాతం రాయితీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఈ నెల 11వ తేదీన ఏడు నాన్‌ ఏసీ, ఒక ఏసీ బస్సు, 12న తొమ్మిది బస్సులు, 13న ఆరు నాన్‌ ఏసీ, ఒక ఏసీ బస్సు మొత్తంగా 24 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే విజయవాడ నుంచి ఎనిమిది బస్సులు, రాజమండ్రి నుంచి ఐదు జిల్లాకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌ నుంచి శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం వెళ్లేందుకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామని, అలాగే రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రతి గంటకు బస్సు నడుపుతున్నట్లు తెలియజేశారు. ద్వారాక బస్టేషన్‌ నుంచి 24 గంటలు అధికారుల బృందంచే ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీనిని ప్రయాణికులు గమనించాలని కోరారు.

Updated Date - Jan 08 , 2024 | 12:18 AM