Share News

రెల్లి కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలి

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:37 PM

రాష్ట్రంలో 26 లక్షల మంది రెల్లి, ఉప కులాల్లో ఉన్నారని, వీరికి రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిం చాలని రెల్లి కుల సంఘం రాష్ట్ర అధ్య ుడు గండి విజయ్‌కుమార్‌ అన్నారు.

రెల్లి కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలి
మాట్లాడుతున్న రెల్లి కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్‌

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండి విజయకుమార్‌

సంతబొమ్మాళి (కోట బొమ్మాళి): రాష్ట్రంలో 26 లక్షల మంది రెల్లి, ఉప కులాల్లో ఉన్నారని, వీరికి రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిం చాలని రెల్లి కుల సంఘం రాష్ట్ర అధ్య ుడు గండి విజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం కోటబొమ్మాళి రెల్లి వీధి సుభాష్‌ చంద్రబోస్‌ కళా వేదికపై సంఘ ప్రతినిధుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెల్లి కులం అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ చేసి 3 నుంచి 5 శాతం రిజర్వేషన్‌ కేటాయించాల న్నారు. రాష్ట్రంలో 26 లక్షల జనాభా ఉన్నప్పటికీ ప్రత్యేక రిజర్వేషన్‌ లేకపోవడంతో వివిధ రంగాల్లో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లో రెల్లి కులం లేకపోవడం బాధాకరమన్నారు. తమ కులానికి అన్ని రిజర్వేషన్లు వర్తించేలా న్యాయ పోరాటం చేస్తామ న్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి సంఘ అధ్యక్షుడు కుప్పిలి మురళి, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల నాయకులు గొల్లపల్లి మోహనరావు, వెలగాడ గురువులు, కాట సుదర్శన్‌, పేడాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 11:37 PM