Share News

పాముకాటు మృతిపై ప్రత్యేకాధికారి విచారణ

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:54 PM

పొందూరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యనారా యణ మృతి చెందినట్టు అతడి కుమారుడు చక్రపాణి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీసీహెచ్‌ఎస్‌ ఆదేశాలతో బుధవారం విచారణాధికారి నాగభూషణరావు పీహెచ్‌సీ ని సందర్శించి ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించారు.

పాముకాటు మృతిపై ప్రత్యేకాధికారి విచారణ
విచారణ చేస్తున్న నాగభూషణరావు

పొందూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పొందూరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యనారా యణ మృతి చెందినట్టు అతడి కుమారుడు చక్రపాణి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీసీహెచ్‌ఎస్‌ ఆదేశాలతో బుధవారం విచారణాధికారి నాగభూషణరావు పీహెచ్‌సీ ని సందర్శించి ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించారు. గతేడాది సెప్టెంబరు 16న పొలం లో పాముకాటుకు గురైన సూర్యనారాయణను పొందూరు ప్రభుత్వ ఆసుపత్రికి అతడి కుమారుడు చికిత్స కోసం తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో ఉన్న స్టాఫ్‌నర్స్‌ ఎఫ్‌ఎన్‌వోతో చికిత్స చేయించి, కనీసం పాముకాటు ఇంజక్షన్‌ కూడా ఇవ్వకుండా శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలోనే పరిస్థితి విషమించి అతడు మృతిచెందాడు. దీనిపై చక్రపాణి కలెక్టర్‌కు, డీసీహెచ్‌ ఎస్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయించారు. దీనిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో అప్పటి సూపరింటెండెంట్‌ రామదాస్‌కు, డ్యూటీ డాక్టర్‌ సుజాత, స్టాఫ్‌నర్సు లక్ష్మిలకు చక్రపాణి లీగల్‌ నోటీసులిచ్చారు. దీనిపై డాక్టర్‌ సుజాత వివరణ ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేసిన మృతు డి కుటుంబసభ్యులు మిగిలిన ఇద్దరు స్పందించక పోవడంతో మరోసారి డీసీహెచ్‌ఎస్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎటువంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా డ్యూటీ డాక్టర్‌ సుజాతపై చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో చక్రపాణి విజయవాడలోని ఆరోగ్య శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో జరిగిన విచారణకు సంబంధించిన ఏటీఆర్‌ ఇవ్వలే దని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరణ ఇచ్చిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకున్నా మిగిలిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని విచారణ అధికారిని కోరారు. అప్పటి ఆసు పత్రి సూపరింటెండెంట్‌ రామదాస్‌కు సిబ్బందిపై నియంత్రణ లేకపోవడమే ఘటనకు కారణమని ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల నుంచి వివరణ తీసుకున్న విచారణాధికారి నివేదికను ఉన్నతాధి కారులకు అందిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 11:54 PM