Share News

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:26 PM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ తాళభద్ర యూపీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ జీఆర్‌ రాధిక బుధవారం పరిశీలించారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
వజ్రపుకొత్తూరు: అక్కుపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రాధిక

పలాస, మార్చి 27: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ తాళభద్ర యూపీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ జీఆర్‌ రాధిక బుధవారం పరిశీలించారు. 5వ వార్డులో ఉన్న ఈ పోలింగ్‌ కేంద్రం సమస్యాత్మక కేంద్రాల లిస్టులో ఉండ డంతో ఆమె సందర్శించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. పాఠశాల చుట్టూ ప్రహరీ ఉండడంతో పోలింగ్‌కు ఇబ్బందులు ఉండవని సిబ్బంది ఆమెకు వివరించారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్‌ఐ పారినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

వజ్రపుకొత్తూరు: మండలంలోని అక్కుపల్లి, బైపల్లి పోలింగ్‌ బూత్‌లను బుదవారం ఎస్పీ జీఆర్‌ రాధిక పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. ప్రహరీ, మంచినీరు, విద్యుత్‌ సదుపాయం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. మండలంలోని శివారు గ్రామాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందికి సూచిం చారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఐ రామారావు పాల్గొన్నారు.

ముమ్మరంగా తనిఖీలు

నరసన్నపేట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనా లను ప్రత్యేక బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. డీటీ గాయత్రి ఆధ్వర్యంలో పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు మడపాం, జమ్ము జంక్షన్‌, తామరాపల్లి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేశారు. మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా వాహనాలను తనిఖీ చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నగదును తీసుకువెళ్లితే సీజ్‌ చేస్తామని డిప్యూటీ తహసీల్దార్‌ గాయత్రి అన్నారు. మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

గ్రామాల్లో పోలీసుల కవాతు

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నరసన్నపేట సీఐ బి.ప్రసాదరావు అన్నారు. బుధవారం జమ్ము గ్రామంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని, గ్రామాల్లో అనుమా నితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వా లన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:26 PM