Share News

రైతుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - May 27 , 2024 | 11:23 PM

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో విత్తనాలు, పంట రుణాలు అందించలేదని, రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతుసంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ ఎస్‌ఎస్‌వీనాయుడుకు అందజేశారు.

రైతుల సమస్యలు పరిష్కరించండి
వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘ నేతలు

పలాసరూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో విత్తనాలు, పంట రుణాలు అందించలేదని, రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతుసంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ ఎస్‌ఎస్‌వీనాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను 90 శాతం సబ్సిడీపై అందించాలని, గత ఏడాది వర్షా భావంతో నష్టపోయినందున రైతులకు సబ్సిడీ పెంచాలని, పూర్తిస్థాయిలో పంటల రుణాలను అందిం చాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం నాయకులు వంకల ముకుంద, హనుమంతు రమణ తదితరులున్నారు.

జీడి రైతులను ఆదుకోండి

పలాసరూరల్‌: మార్కెట్‌లో జీడికి సరైన ధర అందించి జీడి రైతనులను ఆదుకోవాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి భీమారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలాస ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఏవో రామారావుకు వినతిపత్రం అందించారు. ప్రస్తుతం మార్కెట్‌లో జీడి పిక్కల ధర కచ్చితమైన రేటు రైతుకు తెలియడం లేదని, రూ.10,500 నుంచి రూ.11,500 మధ్య ఒక్కో గ్రామంలో ఒక్కో ధరను ఇచ్చి దళారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. అధికారులు మార్కెట్‌ ధరను ప్రకటించి స్వదేశీ రైతుల పిక్కల అమ్మకాలు ముగిసే వరకూ విదేశీ పిక్కల దిగుమతిని నిలుపుదల చేయాలని కోరారు. జీడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. వినతి అందజేసిన వారిలో ఐఎఫ్‌టీయూ జిల్లా కన్వీనర్‌ జుత్తు వీరాస్వామి, పీడీ ఎస్‌యూ కార్యదర్శి వినోద్‌, చంద్రయ్య, కోదండరావు, మాధవరావు, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:23 PM