Share News

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి: డీఈవో

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:31 PM

శాస్త్ర, సాంకేతిక విద్య ద్వారా సమాజాని కి ఎంతో మేలు జరుగుతుందని జిల్లా విద్యా శాఖాధికారి కె.వెం కటేశ్వరరావు అన్నారు.

 సైన్స్‌తోనే సమాజాభివృద్ధి: డీఈవో
వైజ్ఞానిక ప్రదర్శనను తిలకిస్తున్న డీఈవో

టెక్కలి: శాస్త్ర, సాంకేతిక విద్య ద్వారా సమాజాని కి ఎంతో మేలు జరుగుతుందని జిల్లా విద్యా శాఖాధికారి కె.వెం కటేశ్వరరావు అన్నారు. ఐతమ్‌ కళాశాలలో గురువారం జరిగిన 11వ జిల్లా వైజ్ఞానిక ప్రాజెక్ట్‌ ప్రదర్శన పోటీల్లో భాగంగా ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డు 2022-23 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలకు శాస్త్ర, సాంకేతి క పరిష్కారాలు చూపడమే వైజ్ఞానిక విద్య లక్ష్యమని తెలిపారు. 164 ప్రాజెక్ట్‌లు ప్రదర్శనకు రాగా 16 ఉత్తమ ప్రాజెక్ట్‌లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపా రు. డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, హెచ్‌వోడీ డాక్టర్‌ శ్రీరాములు, ఎన్‌ఐఎఫ్‌ జూనియర్‌ సైంటిస్ట్‌ అవినాష్‌ సమాల్‌, జిల్లా వైజ్ఞానిక అధికారి కుమారస్వామి ఉపవిద్యాశాఖాధికారి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:31 PM