Share News

కొట్లాట కేసులో ఆరుగురి అరెస్టు

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:53 PM

జి.సిగడాం గ్రామంలో ఇటీ వల భూ వివాదంలో ఇరువ ర్గాల మధ్య కొట్లాట జరిగిం ది. ఈ ఘటనలో నాయిన సూర్యనారాయణ, వెంకట రావుపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. దాడికి పాల్పడిన ఆరు గురిని అరెస్టు చేసినట్టు జేఆర్‌ పురం సీఐ ఎం. అవతారం తెలిపారు.

కొట్లాట కేసులో ఆరుగురి అరెస్టు
మాట్లాడుతున్న సీఐ అవతారం

రణస్థలం/జి.సిగడాం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జి.సిగడాం గ్రామంలో ఇటీ వల భూ వివాదంలో ఇరువ ర్గాల మధ్య కొట్లాట జరిగిం ది. ఈ ఘటనలో నాయిన సూర్యనారాయణ, వెంకట రావుపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. దాడికి పాల్పడిన ఆరు గురిని అరెస్టు చేసినట్టు జేఆర్‌ పురం సీఐ ఎం. అవతారం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. జి.సిగడాం రెవెన్యూ పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై సోమవారం అదే గ్రామానికి చెందిన నాయిన శివన్న, ఎన్‌.లక్ష్మణరావు, ఎన్‌.సీతంనాయుడు, ఎన్‌.శంకరరావు, ఎన్‌.గోపి, ఎన్‌. రాజు నీరు కట్టే పయత్నం చేశారని, కోర్టు వివాదంలో ఉన్న భూమి పైకి ఎందుకు వచ్చాంటూ ప్రశ్నించిన నాయిన సూర్యనారాయణ, వెంకటరావుపై వారంతా కత్తులు, కర్రలతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు జి.సిగడాం ఎస్‌ఐ వై.మధుసూదనరావు దాడికి పాల్పడిన ఆరుగురుని అరెస్టు చేసి పొందూరు కోర్టులో హాజరు పరచగా న్యాయాధి కారి రిమాండ్‌ విధించారు. దీంతో వారిని అంపోలులోని జిల్లా జైలుకి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు సమావేశంలో జేఆర్‌ పురం ఎస్‌ఐ చిరంజీవి, జి.సిగడాం ఎస్‌ఐ వై.మధసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:53 PM