Share News

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సిక్కోలు సత్తా

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:49 PM

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పలువురు ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సిక్కోలు సత్తా

నరసన్నపేట/జలుమూరు, జూన్‌ 9: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పలువురు ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు. జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్‌కుమార్‌ జాతీయస్థాయిలో 637వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. ఓబిసీ కేటగిరీలో 88వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు రమాదేవి, బుట్టెన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరి స్వస్థలం కరవంజ గ్రామమైనా.. ఉద్యోగరీత్యా పాలకొండలో నివాసముంటున్నారు.

- నరసన్నపేట మండలం దూకలపాడు గ్రామానికి చెందిన అల్లు రామలింగం నాయుడు జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరిలో 803 వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118వ ర్యాంకు సాధించారు.

- నరసన్నపేట పట్టణం శ్రీరామనగర్‌కు చెందిన కోరాడ సౌదీఫ్‌ ఓపెన్‌ కేటగిరిలో 1,265వ ర్యాంకు సాధించారు.

- నరసన్నపేట మండలం సుందరాపురానికి చెందిన గొండు సాయి ప్రణీత్‌ ఓబీసీ విభాగంలో 826వ ర్యాంకు, ఓపెన్‌ కేటగిరిలో 4,377వ ర్యాంకు పొందారు. తల్లిదండ్రులు గొండురంగారావు, వెంకటరత్నం ఇద్దరు ఉపాధ్యాయులే.

- నరసన్నపేటలోని పాతబస్టాండ్‌కు చెందిన తంగుడు దీపక్‌ జాతీయస్థాయిలో 5,208 ర్యాంకు సాధించగా ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో 596వ ర్యాంకు సాధించారు. తండ్రి పకీర్‌ ఆటోమొబైల్‌ షాపు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:49 PM